శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeసినిమాబాలయ్య బాబు దెబ్బకు వాళ్లకు ఇక దబిది.. దిబిడే

బాలయ్య బాబు దెబ్బకు వాళ్లకు ఇక దబిది.. దిబిడే

కథానాయకుడిగా తెలుగు చలన చిత్రంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుని ప్రజా నాయకుడిగా హిందూపురం లో ప్రజా పాలనకు ప్రాణం పోస్తూ.. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా కొనసాగుతూ. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న మన తెలుగు చలనచిత్ర నటసింహం నందమూరి బాలకృష్ణ గారి పుట్టిన రోజు కానుకగా ఆయన నటిస్తున్న చిత్రం BB3 నుండి వచ్చిన టీజర్ విడుదలై ఒక్క రోజులోనే 6.7మిలియన్ వ్యూస్ మరియు 2.8 లక్షల లైక్ తో దూసుకుపోతుంది.

అందులో బాలకృష్ణ గెటప్ చాలా వైవిధ్యంగా ఉంది అతని నోట పలికిన డైలాగ్స్ బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో మరో బ్లాక్ బస్టర్ ఖాయం అన్నట్టుగా ఉంది. ఎస్.ఎస్.తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ టీసర్ మరో స్థాయికి తీసుకెళ్ళింది గతంలో వీళ్ళిద్దరూ కలిసి చేసిన సింహా, లెజెండ్ ఏ స్థాయి విజయాన్ని అందుకున్నాయో అందరికి తెలిసిందే బాలయ్య ఫ్యాన్స్ కి బోయపాటి మరచిపోలేని కానుక ఈ టీజర్ తో ఇచ్చారు.

ఈ టీజర్ లో చెప్పిన డైలాగ్స్ తో కొంతమంది రాజకీయనాయకులపై వేసిన సెటైర్లు బాలయ్య ఫ్యాన్స్  కి పూనకాలు తెప్పించే విదంగా ఉన్నాయి. బాలయ్య గెటప్ బట్టి చూస్తె ఇలాంటి డైలాగ్స్ చాలా ఉంటాయని బాలయ్య ఫాన్స్ తెగ రచ్చ చేస్తున్నారు.  ఒక వైపు సినిమా పరంగా మరోవైపు రాజకీయం పరంగా బాలయ్య సినిమాతో ట్రోలర్స్ అందరికీ ఇక దబిది.. దిబిడే అని చెప్పాలి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular