ఆదివారం, జూలై 21, 2024
Homeటెక్నాలజీTikTok కి చుక్కలు చూపిస్తున్న ఇండియన్స్...బ్యాన్ దిశగా కేంద్రం..!

TikTok కి చుక్కలు చూపిస్తున్న ఇండియన్స్…బ్యాన్ దిశగా కేంద్రం..!

నేటి యుగంలో టిక్ టాక్ యాప్ గురించి అసలు తెలియని వారంటూ ఎవరూ ఉండరేమో ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా టాప్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఒకానొక సమయంలో 4.9 రేటింగ్ కి కూడా వెళ్ళింది. తాజాగా టిక్ టాక్  రేటింగ్ ప్రస్తుతం మన ఇండియాలో తగ్గుముఖం పడుతున్నాయి.

దీనికి కారణం యాప్ ను బ్యాన్ చేయాలంటూ చాలామంది నెటిజన్లు కోరుతుండడం మరియు టిక్ టాక్ లో యూజర్స్ మద్య కొన్ని గొడవలు కూడా తలెత్తాయి. నార్త్ కు సంబందించిన కేరీమినటి అనే ఒక యూట్యూబర్ టిక్ టాక్ కు సంబందించి  రోస్ట్ విడియో చేయడంతో ఆ వీడియో కొద్ది గంటల్లోనే మిలియన్స్ వ్యూస్ రావడంతో. టిక్ టాక్ యూజర్స్ అతని యూట్యూబ్ వీడియో పై రిపోర్ట్ చేసారు దానితో యుట్యూబ్ ఆ వీడియోని డిలీట్ చేసింది.

కేరీమినటి యుట్యూబ్ ఫాలోవర్స్ టిక్ టాక్ పై హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్విట్టర్ లో పెట్టడంతో ఒక్కసారిగా ఫాలోవర్స్ మొత్తం టిక్ టాక్ కి 1రేటింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా టిక్ టాక్  రేటింగ్ పడిపోయింది. ట్విట్టర్ లో “బ్యాన్ టిక్ టాక్” హ్యాష్ ట్యాగ్ ట్రేండింగ్ లోకి వెళ్ళింది.

యాప్ 4.5 రేటింగ్ నుండి 1.2 రేటింగ్ కి పడిపోయింది. నార్త్ ఇండియా మొత్తం ఈ టిక్ టాక్ బ్యాన్ పై గట్టిగా పట్టుబడుతున్నారు. టిక్ టాక్ బ్యాన్ చేయాలంటూ మహిళా కమిషనర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. యాప్ స్టార్టింగ్ లో ఇటువంటి ఇబ్బందులనే ఎదుర్కొంది కొన్ని రాష్ట్రాల్లో నిషేధాన్ని కూడా విధించారు.

కానీ తర్వాత కాలంలో నిషేధాన్ని ఎత్తివేసి ఈ యాప్ ను అందుబాటులోకి ప్రభుత్వాలు తీసుకువచ్చాయి. ఈ యాప్ ను ఉపయోగించి చాలామంది మరణించడం, సైక్లాజికల్ ప్రోబ్లమ్స్ తలెత్తుతాయని కూడా వైద్య నిపుణులు వాదిస్తున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular