శనివారం, మే 25, 2024
HomeHOMEబెలూచిస్థాన్ దెబ్బకి చేతులెత్తేసిన పాకిస్థాన్ SSG కమేండోస్

బెలూచిస్థాన్ దెబ్బకి చేతులెత్తేసిన పాకిస్థాన్ SSG కమేండోస్

పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్ లోని పంచ్ గోర్ లోని నుస్కీ అనే ప్రాంతంలో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ కేంప్ పై దాడి చెయ్యడంతో ఆ దాడిలో సుమారు 170 మండి పాకిస్థాన్ జవాన్లు మరణించారని బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. అయితే ఈ విషయంపై పాకిస్థాన్ ప్రభుత్వం స్పందిస్తూ ఏడుగురు జవాన్లు మాత్రమె చనిపోయారని తెలిపింది.

అయితే బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్ ఆర్మీ పై దాడి చేసిన తరువాత ఆ కేంప్ లను స్వాదీనం చేసుకున్నారు. అయితే చనిపోయిన పాకిస్థాన్ జవాన్ల మృత దేహాలు ఇప్పటికీ అక్కడే అలాగే ఉన్నాయి. దీనితో పాకిస్థాన్ కి చెందిన ఆర్మీ అదికారులు కొంతమంది జవాన్లను ఆ ప్రాంతానికి పంపించగా ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవడంతో చివరికి పాకిస్థాన్ తన SSG కమేండోలను పంపించింది అయితే బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ వీరిపై దాడి చెయ్యడంతో ఇద్దరు SSG కమేండోలు చనిపోయారు దీనితో పాకిస్థాన్ ఆర్మీ వెంటనే SSG కమేండోలను తిరిగి వెనక్కు వచ్చేయ్యాలని ఆదేశించింది.

ప్రస్తుత పాకిస్థాన్ లో జరిగిన ఈ ఘటనను బయటికి పొక్కకుండా మీడియాపై అంక్షలు పెట్టడమే కాకుండా అక్కడి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయితే మూడు రోజులు గడుస్తున్నా పాకిస్థాన్ ఆర్మీ కేంప్ లను స్వాదీనం చేసుకోలేకపోయింది. ఆయా కేంప్ లను స్వాదీనం చేసుకోవడానికి హెలికాఫ్టర్ లను రంగంలోకి దింపింది.

అయితే ఈ ఘటనపై భారత్ హస్తం ఉందంటూ పాకిస్థాన్ భారత్ పై నిందలు వేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పాకిస్థాన్ ఆర్మీ పై బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే అనేక సార్లు దాడి చేసింది దీనికి ప్రధాన కారణం పాకిస్థాన్ నుండి తమకు స్వతంత్ర దేశం కావాలంటూ ఎప్పటినుంచో పోరాటం చేస్తుంది. అయితే పాకిస్థాన్ గవర్న్మెంట్ చైనాతో కలిసి Belt & Road అనే చైనా –పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో చైనా నుండి పాకిస్థాన్ మీదుగా ఈ కారిడార్ నిర్మాణం మొదలు పెట్టడంతో ఆ రోడ్డు బెలూచిస్థాన్ మీదుగా వెళ్ళడంతో ఆ రోడ్డు నిర్మాణం చేసే చైనీయులపై బెలూచిస్థాన్ ఆర్మీ దాడులు జరిపేది దీనితో ఒక్కడ పని చేసే చైనా దేశస్తులకు పాకిస్థాన్ ఆర్మీ రక్షణ కల్పిస్తూ వస్తోంది.

Read Also..భారత్ చేతికి మరొక అతి పెద్ద డీల్.. బరాక్-8 మిస్సైల్ సిస్టం కొనుగోలు చేయనున్న దుబాయ్ 

Read Also..తైవాన్ గగంతలలోకి ప్రవేసించిన చైనాకు చెందిన 39 యుద్ధ విమానాలు 

Read Also..BrahMos Supersonic Cruise Missile: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిస్సైల్ పరీక్ష విజవంతం       

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular