శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeసినిమాదియేటర్ లో అఖండ సినిమా చూసి షాకింగ్ కామెంట్స్ చేసిన బాలయ్య

దియేటర్ లో అఖండ సినిమా చూసి షాకింగ్ కామెంట్స్ చేసిన బాలయ్య

బోయపాటి డైరెక్షన్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం అఖండ గురువారం రిలీజైన ఈ సినిమా సూపర్ టాక్ తెచ్చుకుని బోయపాటి మరియు బాలయ్య కాంభినేషన్ లో మూడవ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా రెండవ రోజు వస్తున్న టాక్ మాత్రం బ్లాక్ బాస్టర్ అంటూ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాను డైరెక్టర్ బోయపాటి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో పాటు మరికొంతమంది చిత్ర యూనిట్ తో కలిసి బాలకృష్ణ అఖండ సినిమాను దియేటర్ లో వీక్షించారు  తాజాగా ఈ సినిమా సక్సెస్ పై చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో పాల్గొన్న బాలయ్య ఈ సినిమా ను ఇప్పుడే దియేటర్ లో చూసానని చెబుతూ దియేటర్ లో చూసాక సినిమాలో చేసింది అసలు నేనేనా అన్న అనుమానం వచ్చిందంటూ అంతగా ఈ సినిమాకి ప్రతీఒక్కరూ కష్టపడ్డామని అఘోర పాత్ర కోసం, మేకప్, నుదుటున పెట్టుకున్న బొట్టు వంటి వాటి కోసం తాను మరియు డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి చాలా రోజులు అఘోరాల వస్త్ర దారన పై చాలా రిసెర్చ్ చేసామన్నారు.

అంతేకాక తనకు కొంచెం భక్తి ఎక్కువేనని అందుకే ఆ లాజిక్ బోయపాటి పట్టుకున్నారని అన్నారు. పార్వతీ పరమేశ్వరుల దయతో ఈ సినిమా నావద్దకు వచ్చి చివరకు అఖండ విజయం అయ్యిందని అన్నారు. తాజాగా ఈ అఖండ సినిమా Bookmyshow, Jesttickets వంటి Online ticket booking sites లలో భారీ రేటింగ్ అందుకోగా  ప్రముఖ IMDb Ratings లో ఏకంగా 24 గంటల్లో 8.0/10 రేటింగ్ తో సంచలనాలను సృష్టిస్తోంది. 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular