వెన్నునొప్పి ఉపశమనం కోసం చిట్కాలు.. | Back pain tips in telugu

0
425
Back pain tips in telugu
Back pain tips in telugu

Back pain tips in telugu నేటి రోజుల్లో వెన్నునొప్పి అనేది మనం సర్వ సాదారణంగా వింటున్న ఒక సమస్య. ఈ సమస్య  వంగి పని చేసే వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది.

ఎక్కువ నీరసంగా ఉన్నప్పుడు అధిక బరువులు ఎత్తడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ప్రస్తుతం యవ్వన వయసు గల వారి నుంచి పెద్దవాళ్ల వరకూ ప్రతీ ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు.

దీన్ని భాద నుండి  ఉపసమనం పొందటానికి టాబ్లెట్లు కూడా వాడుతుంటారు. ఎలాంటి టాబ్లెట్స్ అవసరం లేకుండా దీన్ని సహజంగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని సహజంగానే మన రోజువారి అలవాట్ల ద్వారా కూడా తగ్గించుకోవచ్చు.

1. హెల్తీ వెయిట్ ని మెయింటేన్ చేయాలి.

మన శరీరాన్ని ఎప్పుడూ దృడంగా  గా ఉంచుకోవాలి. అలా ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా పండ్లు మరియు కూరగాయలు తింటూ ఉండాలి. ఎక్కువగా ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి. మనం రోజూ తినే భోజనం కూడా ఒక డైట్ ప్రకారం తీసుకోవాలి. దాని వల్ల మన శరీరం ఫిట్ గా  ఉంటుంది మరియు మన వెన్ను కూడా చాలా ఆరోగ్యాంగా ఉంటుంది.

2. మీ వెనక కండరాలను బలంగా ఉంచుకోండి.

శరీరం దృడంగా గా లేని వాళ్ళు ఫిట్ గా ఉండాలనే కోరికతో ఒకేసారి ఎక్కువ బరువులను ఎత్తుతూ (వ్యాయామం) ఉంటారు. అలా ఒకేసారి అధిక బరువులు ఎత్తడం వల్ల మన శరీర వెనక కండరాలపై చాలా ఒత్తిడి పడుతుంది దానివల్ల Back pain కూడా వస్తుంది. కాబట్టి, ఒకేసారి అదిక బరువులు ఎత్తకుండా జాగ్రత్తగా ఉండాలి.

3. కండరాలను రోజూ సాగదీస్తూ ఉండాలి.

ఈ వెన్ను సమస్యల నుంచి మనం బయటపడడానికి మన కండరాలు ఎప్పటికప్పుడు సాగదీస్తూ లేదా మసాజ్ చేస్తూ ఉండాలి. ఒకేసారి బరువులు పైకి ఎత్తేముందు  మన శరీరానికి కొన్ని ఎక్సర్సైజులు అలవాటు చేయాలి మనం ప్రతీ రోజూ చేసుకునే చిన్న చిన్న ఎక్సర్ సైజ్ శరీరానికి  అలవాటు పడిన తరువాత మాత్రమె బరువులు ఎత్తడం వంటివి చేయాలి. దాని వల్ల కండరాలు కూడా వ్యాయామం అవుతుంది. ఇలా చేయటం వల్ల Back pain రాదు.

4. ఒకే చోట వెన్ను కిందకు వాల్చి ఎక్కువ సేపు కూర్చోకూడదు

 ఒకే చోట వెన్ను కిందకు వాల్చి ఎక్కువ సేపు కూర్చోకూడదుమరియు వంగకూడదు దీనివల్ల వెన్ను పూసల్లో గ్యాప్ వచ్చి అవి వెన్ను నొప్పుకు కారణం అవుతాయి. ప్రతీ రోజూ మనం ఆఫీస్ లో గాని ఇంటి వద్ద కాని పనిచేసే సమయంలో వెన్ను నిటారుగా పెట్టి పనిచేసుకూవాలి. అదే విదంగా 40 నిమిషాలకు ఒక సారి నిటారుగా లేచి అప్పుడు మళ్ళీ కూర్చోవాలి దీనితో వెన్నుముఖ పై అదిక ప్రభావం పడకుండా ఉంటుంది.

పైన చెప్పుకున్నవి కరెక్ట్ గా ప్రతీరోజూ  పాటించటం వల్ల శరీర కండరాల నొప్పులు రాకుండా ఉంటాయి. అవి రాకుండా ఉండటం వల్ల మనం Back pain నుంచి కూడా సురక్షితంగా ఉండవచ్చు.