విశాఖ అనర్ధానికి విజయసాయిరెడ్డే కారణం.. అయ్యన్నపాత్రుడు ధ్వజం

0
155
ayyanna patrudu serious on vijaya saireddy
ayyanna patrudu serious on vijaya saireddy

వైజాగ్ లో జరిగిన ఎల్​జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. ప్రస్తుతం ప్రతిపక్షాలు అధికార పక్షం పై దుమ్మెత్తి పోస్తున్నాయి . మరోవైపు బాదితులు సైతం ప్రభుత్వం పై ఆందోళనకు దిగారు. ఆ కంపెనీని ఎలాగైనా మూసివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.నేడు  ప్రజల ఆరోగ్యం కంటే పరిశ్రమల నుండి వచ్చే లాబం ముఖ్యం కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజకీయంగా కూడా ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న అనర్థాలకు మూలం విజయసాయిరెడ్డేనని మీడియా సమావేశంలో తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఎల్​జీ పాలిమర్స్ పరిసరాల్లో ఉన్న ఇళ్లు ఖాళీ చేయాలని ఇటీవల ప్రభుత్వం ఎందుకు నోటీసులు ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. నోటీసులు వెనుక విజయసాయిరెడ్డి హస్తం ఉందని ఆరోపించారు.

ఈ ఘటనను అంతా ఖండించాలని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను జనావాసాల నుండి తీసేయాలని డిమాండ్ చేశారు. అవసరం అయితే దీనికోసం రాజకీయలకు అతీతంగా అందరూ ఒకే తాటిపైకి రావాలని, అన్ని రాజకీయ పార్టీలు ఒకే మాట మీద  ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అసలు లాక్​డౌన్ వల్ల ఎక్కడివక్కడే నిలిచిపోయిన నేపథ్యంలో అంతా దిగ్బంధనంలో ఉన్న ఇలాంటి తరుణంలో అత్యవసర ఉత్పత్తి లేని ఎల్​జీ పాలిమర్స్ ప్రారంబించడానికి అనుమతులు ఎలా ఇచ్చారో కూడా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.