అవొకాడో అనగానే అందరికి గుర్తొచ్చేది అవొకాడో ఆయిల్ .దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఆయిల్ ని మనం చాలా రకాలుగా వాడొచ్చు అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఈ ఆయిల్ ని చాలా వరకు అందరూ వంటల్లో వాడుతుంటారు. ఈ ఆయిల్ చర్మ రక్షణకు కూడా ఉపయోగపడుతుంది. దీన్ని అనేక క్రీమ్లలో, సన్ స్క్రీన్లలో మరియు మోయిశ్చరైజర్స్ లో వాడతారు. ఇక పోతే ఈ అవొకాడో ఆయిల్ వల్ల మనకు కలిగే లాభాలలో చర్మానికి సంభందించిన లాభాలు కూడా చాలానే ఉన్నాయి. అవేంటో ఎలా సహాయపడతాయో ఇప్పుడు చూద్దాం.
Avocado Oil Benefits in Telugu :
- ఈ అవొకాడో ఆయిల్ విటమిన్ (ఎ), విటమిన్ (డి) మరియు విటమిన్ (ఇ) కలిగి ఉంటుంది. విటమిన్ (ఇ) తో పాటు పొటాషియం ను కలిగి ఉంటుంది. దాని వల్ల దీన్ని మనం చర్మానికి అప్లై చేసుకున్నప్పుడు మన చర్మం మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది. ఈ ఆయిల్ మన చర్మాన్ని ఆయిలీ గా ఉంచుతూ ఎటువంటి పింపుల్స్ మరియు రాషెస్ రాకుండా కాపాడుతుంది. మనకు తగిలిన దెబ్బలను కుడా త్వరగా తగ్గిస్తుంది.
- ఈ ఆయిల్ ను చర్మానికి అప్లై చేసుకోవడం వల్ల మనకు వడ దెబ్బ తగలకుండా కాపాడుతుంది. సహజంగా మన వయసు పెరగడం, మన చెర్మంలోని మార్పుని బట్టి గుర్తిస్తాం. ఈ ఆయిల్ లోని ఫ్యాట్స్ ని తీసుకోవడం వల్ల చర్మం త్వరగా ముడుచుకుపోకుండా ఉంటుంది.

- ఈ అవొకాడో నూనె ను తల కు పెట్టుకోవటం వల్ల తలలోని చుండ్రు భాద నుండి బయట పడచ్చు. డ్రై స్కిన్ గల వాళ్ళు అవొకాడో ఆయిల్ ను మరియు ఆలివ్ ఆయిల్ సమంగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు చర్మానికి అప్లై చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.
- ఈ ఆయిల్ ముఖ్యంగా డయాబెటిస్ మరియు అధిక కొలెస్ట్రాల్ కలిగిన వాళ్లకి బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ అవొకాడో ఆయిల్ గురించి ఎన్నో ఉపయోగాలు తెలుసుకున్నారు కదా. కాబట్టి ఈ ఆయిల్ ని తప్పక ఉపయోగించండి. మార్పును గమనించండి…ఆనందించండి.