శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeక్రీడలుAndrew Symonds Death | ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ సైమండ్స్ మృతి

Andrew Symonds Death | ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ సైమండ్స్ మృతి

Andrew Symonds Death ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (46) మరణించాడు. ఆస్ట్రేలియాలోని టౌన్స్ విల్లే లో జరిగిన ఒక కారు ప్రమాదంలో సైమండ్స్ మరణించాడు. శనివారం రాత్రి బయటకు వచ్చిన సమయంలో అతని కారును వేరొక కారు బలంగా డీకొనడంతో కారు బోల్తా కొట్టిందని అక్కడి పోలీసులు తెలిపారు. అతనికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ జరగిందని ఎమెర్జెన్సీ రెస్క్యూ టీం అక్కడికి చేరుకుని హాస్పటల్ కి తీసుకువెళ్ళే సమయానికే సైమండ్స్ మృతి చెందాడు Andrew Symonds Death. ఇప్పటికే గత మూడు నెలల్లో ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లు మరణించడంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులో విషాద చాయలు అలుముకున్నాయి.

Andrew Symonds Death ఈ సంవత్సరం మార్చి నెలలో ఆస్ట్రేలియా క్రికెటర్ మార్స్ మరణించిన 24 గంటలు గడవకుండానే ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్ గుండెపోటుతో మరణించాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో సైమండ్స్ తన చివరి మ్యాచ్ 2009 మే 7 న తన చివరి T20 మ్యాచ్ ని పాకిస్థాన్ తో ఆడాడు అయితే ఈ సిరీస్ తో సైమండ్స్ పలు వివాదాల్లో నిలిచాడు. అయితే కొన్ని కధనాల ప్రకారం మద్యానికి బానిస అయిన కారణంగా ఈ T20 మ్యాచ్ నుండి సైమండ్స్ ను తీసేసారనే వార్తలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఆస్ట్రేలియన్ క్రికెట్ కి మరో విషాధమనే చెప్పాలి.       

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular