శనివారం, జూలై 27, 2024
Homeక్రీడలుAUS vs PAK: ఆస్ట్రేలియా గెడ్డపై 25 ఏళ్లగా ఒక్క టెస్ట్ సిరీస్ కూడా నెగ్గని...

AUS vs PAK: ఆస్ట్రేలియా గెడ్డపై 25 ఏళ్లగా ఒక్క టెస్ట్ సిరీస్ కూడా నెగ్గని పాకిస్థాన్

AUS vs PAK మద్య మూడు టెస్ట్ సిరీస్ లలో బాగంగా నేడు మొదటి టెస్ట్ మరి కొంత సేపట్లో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం 14వ తారీకు ఉదయం 07:45నిమిషాలకు మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రపంచకప్ సాదించి మంచి జోష్ లో ఉన్న ఆస్ట్రేలియా ఎలాగైనా పాకిస్థాన్ ను క్లీన్ వాష్ చేసి ఈ సిరీన్ ను దక్కించుకోవాలని చూస్తోంది. ఇక ఆస్ట్రేలియా టీమ్ విషయానికి వస్తే

  1. డేవిడ్ వార్నర్
  2. ఉస్మాన్ కవాజా
  3. మర్నాస్ లాబుస్చాగ్నే
  4. స్టీవ్ స్మిత్
  5. ట్రావిస్ హెడ్
  6. మిచెల్ మార్ష్
  7. అలెక్స్ కేరీ
  8. పెట్ కమ్మిన్స్
  9. మిచెల్ స్టార్క్
  10. నాథన్ లియాన్

జోష్ హేజేల్వుడ్
వంటి పూర్తి స్థాయి టీం తో బరిలోకి దిగింది ఆస్ట్రేలియా. అయితే ఇప్పటికే ప్రపంచ కప్ లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి సూపెర్ ఫామ్ లో ఉన్న వార్నర్, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను గెలిపించిన ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ వంటి టాప్ ప్లేయర్లతో ఆస్ట్రేలియా పాకిస్థాన్ పై కచ్చితంగా నేగ్గుతామనే దీమాగా ఉంది అంతేకాక ఈ మ్యాచ్ లు ఆస్ట్రేలియా సొంత గడ్డపై జరగడం ఆస్ట్రేలియాకు మరింత కలిసొచ్చే అంశం ఇదంతా ఆస్త్రేలియావైపు.
ఇక పాకిస్థాన్ గురించి చెప్పాలంటే వరల్డ్ కప్ పరాభవం తరువాత పాకిస్థాన్ టీమ్ లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్ టీమ్ విషయానికి వస్తే

1.ఇమ్రాన్ ఉల్ హక్

2. అబ్దుల్ షఫీక్

3. షాన్ మసూద్
4.బాబర్ ఆజమ్
5.సౌద్ షకీల్
6. శర్ఫరాజ్ అహ్మద్
7. సల్మాన్ ఆలీ ఆగా
8. ఫహీం అష్రఫ్
9. షహీన్ ఆఫ్రిదీ
10. ఆమిర్ జమాల్
11. ఖుర్రం షాజాద్

వంటి ప్లేయర్లతో పాకిస్థాన్ బరిలోకి దిగితోంది. అయితే పాకిస్థాన్ కెప్టెన్ మార్పు తరువాత టీం పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. పాకిస్థాన్ ఆస్ట్రేలియా గెడ్డపై సిరీస్ నెగ్గి దాదాపు 25 సంవత్సరాలు అవుతోంది. చివరిగా 1995 లో ఆసిస్ పై పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ నెగ్గింది అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క టెస్ట్ సిరీస్ కూడా నెగ్గక పోవడం పాకిస్థాన్ ను కలవరపెడుతోంది. నేడు మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా లోని పెర్త్ లో జరగనుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular