అత్యధిక అణ్వస్త్ర క్షిపణులు కలిగిన దేశంగా పాకిస్థాన్..!

అణ్వాయుదాలు అత్యధికంగా కలిగిన దేశాల జాబితాలో పాకిస్థాన్ ఐదో స్థానంలో నిలవనుంది ఇటీవల కాలంలో పాకిస్థాన్ తన అణ్వాయుధ సంపత్తిని బారీగా పెంచుకుంటుంది. ఇప్పటివరకూ పాక్ దగ్గర 145 నుండి 160 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి ఈ సంఖ్య వచ్చే ఐదారు సంవత్సరాల్లో 220 నుండి 250 వార్ హెడ్స్ వరకు పెంచాలని పాక్ భావిస్తుంది. ఇదే విధంగా పాక్ అణ్వాయుదాలను పెంచుకొంటూ పోతే అణ్వాయుధాలు అధికంగా ఉన్న దేశాల సరసన పాక్ ఐదో స్థానంలో నిలవనున్నట్లు ఓ సర్వేలో తెలిపింది.
పాకిస్థాన్ గత పది సంవత్సరాల కాలంలో భారీమొత్తంలో అణ్వాయుధాలు సమకూర్చుకోవడం ఆందోలన కలిగిస్తుందని అమెరికా వెల్లడించింది అణ్వస్త్రాలతో పాటు డెలివరీ సిస్టమ్స్, ఫిజైల్ మెటీరియల్స్ ప్రొడక్షన్ ఇండస్ట్రీని పాక్ విస్తృతంచేస్తూ పోతుండడంతోఅమెరికా సహా ఇతర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్థాన్ కి చిర మిత్రుడైన చైనా కూడా పాకిస్తాన్ కి అణ్వాయుధ టెక్నాలజీ అందించడం భారత్ ను కలవరపాటుకు గురిచేస్తుంది.