గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeరాజకీయంలాక్ డౌన్ అనేది రాజ్యాంగ విరుద్దం...అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్

లాక్ డౌన్ అనేది రాజ్యాంగ విరుద్దం…అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్

ప్రస్తుతం కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు అన్నీ పోరాడుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఎంత కష్టమైనా రేపటి భవిష్యత్తు కోసం పోరాడుతుంటే కొందరు నాయకులు మాత్రం విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.

కరోనా తీవ్రత దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీ పలు రాష్ట్రాల సీఎం లను  ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో ఉన్న  కరోనా కేసుల వివరాలు తెలుసుకుని  తదుపరి మోడీ లాక్ డౌన్ విధిస్తూ వచ్చారు.

అయితే కొన్ని రాష్ట్రాల సీఎం లు  మాత్రం తమ సొంత నిర్ణయంతోనే లాక్ డౌన్ పెంచుకుంటూ వచ్చ్చారు.  దీనిలో తెలంగాణా సీఎం కేసీఆర్ ఒకరు. అయితే లాక్ డౌన్ పొడిగింపు పై ఎంఐఎం  అధినేత అసదుద్దీన్ ఓవైసీ  లాక్ డౌన్ పై కొన్ని సంచలనం వ్యాఖ్యలు చేశారు.

లాక్ డౌన్ అనేది రాజ్యాంగం విరుద్ధమంటూ లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలు తూచా తప్పకుండా ఎలా పాటిస్థాయని మండిపడ్డారు. లాక్ డౌన్ వల్ల వలస కూలీలు తమ రాష్ట్రాలకు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు.

అయితే అసదుద్దీన్ ఓవైసీ మాత్రం ప్రదాని మోడీ నిర్ణయాలను అనేక సార్లు వ్యతిరేకించారు మోడీ దేశప్రజల యూనిటీ కోసం దీప ప్రజ్వలన చేసి చప్పట్లు కొట్టమన్నప్పుడు కూడా అసదుద్దీన్ దీపాలు పెట్టి చప్పట్లు కొట్టినంతమాత్రాన కోరోనా అంతరించిపోదంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.

ప్రస్తుతం కరోనా అందరికీ వస్తుంది భయపడకుండా 8 నుండి 10 రోజులు కొరెంటైన్ లో ఉంటే చాలన్నారు. ప్రస్తుతం అసదుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular