శనివారం, జూలై 27, 2024
Homeజాతీయంఅమిత్ షా పై ఘాటు వ్యాక్యాలు చేసిన... అసదుద్దీన్ ఓవైసీ

అమిత్ షా పై ఘాటు వ్యాక్యాలు చేసిన… అసదుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అదినేత అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షా పై సంచలన కామెంట్స్ చేసారు. ఎప్పుడూ కేంద్రం పై విమర్శలు గుప్పించే ఓవైసీ నేడు అమిత్ షా ను ఆర్గేట్ చేసి మాట్లాడారు.. తాజాగా అమిత్ షా 130 కోట్ల జనాభా ఉన్న భారత్ మన బలం ఒక్క సారి భారతీయులు ఏకమై ఫారిన్ వస్తువులను కొనడం మానెయ్యాలని డిసైడ్ అయితే భారత్ ఎకానమీ ఊహించని విధంగా జంప్ అవుతుందని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

అయితే దీనిపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ “అర్రే అమిత్ షా ఫారిన్ గూడ్స్ ఎలా బహిస్కరించాలో విడమరచి ఒక సారి చేబితే మేము కూడా వింటాం” అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. దేశంలోని చాలా రంగాల్లో విదేశీ వస్తువులపై చాలా వరకూ ఆదారపడుతున్నామని FDI లకు మీరే అనుమతులిచ్చి మీరే బహిష్కరించాలని చేబుతారా అని ప్రశ్నించారు.

మొబైల్ స్పేర్ పాట్స్ కి  సంబంధించి 88 శాతం, ఔషదాల తయారీ పరిశ్రమలో 70శాతం మరియు వైద్యానికి అవసరమయ్యే కిట్లు 60శాతం దిగిమతి చేసుకుంటుండగా బయటి దేశ వస్తువులను ఎలా నిషేదించాలో చెప్పాలను కోరారు. అంతేకాక గబ్లిగి జమాత్ విషయం పై కూడా స్పందించిన ఓవైసీ వారిపై ప్రశంసల జల్లు కురిపించారు. తబ్లిగీ జమాత్ సభ్యులను ఇప్పటికీ కొంతమంది శత్రువులుగా చూస్తున్నారని వారు మాత్రం కరోనా తో ఆరోగ్యం క్షీణించిన వారికి ప్లాస్మా దానం చేస్తున్నారని అమ్మారు.

ప్రస్తుతం ఓవైసీ చేసిన వ్యాక్యలను బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. విదేశీ వస్తువులు మాత్రమె భారత్ లో ఉన్నాయా అంటూ ఇక్కడ కూడా చాలా కంపెనీల వస్తువులు తయారవుతున్నాయని మీకు మాత్రం విదేశీ కంపెనీలే కనిపిస్తాయని మండిపడుతున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular