బుధవారం, జూలై 17, 2024
Homeసినిమాఅరవింద సమేత భారీ ఫైట్ లీక్

అరవింద సమేత భారీ ఫైట్ లీక్

జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తొలిసారిగా వస్తున్న సినిమా అరవింద సమేత వీరరాఘవ ఈ మూవికి త్రివిక్రమ్ మొదటినుంచి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఏదోఒక రూపంలో లీక్ అవుతూనే ఉంది మొదట్లో సినిమాకు సంబంధించిన షూటింగ్ వీడియోలు, ఫోటోలు లీకయిన సంగతి తెలిసిందే. తాజాగా సినిమాలోని 2.30 నిమిషాల నిడివిగల కీలక ఫైట్ సీన్ ఒకటి లీకైంది.అరవింద సమేత

లీకైన సన్నివేశం సెల్ ఫోన్ లో రికార్డు చేయడం గమనార్హం. అది చిన్న వీడియో నే అయినా ఈ లీక్ తో చిత్రబృంధం ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. అయితే ఆ సన్నివేశాన్ని చూస్తె అది రాయలసీమబ్యాక్ గ్రౌండ్ సెటప్ లో ఏర్పాటు చేసిన బారీ యాక్షన్ సన్నివేసమనేటాక్ వినిపిస్తుంది.

ఎన్టీఆర్, నాగబాబు కలిసి తన అనుచరులతో కలిసి కారులో వస్తుంటే నాగబాబును షూట్ చేసే వీడియో ఇందులో కనిపిస్తుంది. ఇప్పటివరకూ త్రివిక్రమ్ తీసిన సినిమాలలో ఇలాంటి బారీ ఫైట్ సీన్స్ చేయలేదనే చెప్పాలి. అయితే మొత్తం సినిమాలో ఈ ఫైట్ ఫాన్స్ ను మరింత ఆకట్టుకునేలా ఉందని అనిపిస్తోంది.అరవింద సమేత

యంగ్ టైగర్ ఎన్టీఅర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తొలిసారి వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.అక్టోబర్ 11న ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సిద్దమవితుంది. యూఎస్ లో ప్రీమియర్ షో కోసం టికెట్ బుకింగ్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు లీకైన సీన్ తో చిత్రబృంధం కొంత ఆందోళన చెందుతోంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular