శనివారం, జూలై 27, 2024
Homeరాజకీయందేవినేని ఉమ కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

దేవినేని ఉమ కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమకు నేడు హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత నెల కొండపల్లి ఫారెస్ట్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేస్తున్నారని కొందరు టీడీపీ నేతలు మరియు మీడుయాతో సహా ఆప్రాంతానికి వెళ్ళిన దేవినేని ఉమ ఆ ప్రాంతాన్ని పరిశీలించి సుమారు గంట సేపు ఆప్రాంతంలో ఉన్న పలు సమాచారాన్ని సేకరించి అక్కడి నుండి తిరిగి వస్తుండగా Devineni Uma కారుతో పాటు మరో కారుపై రాళ్ళదాడి చేసిన విషయం తెలిసిందే.

అయితే విచిత్రంగా Devineni Uma పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి ఆయనను జైలుకు తరలించడంతో దేవినేని ఉమ ఈ విషయంపై హై కోర్టును ఆశ్రయించగా నేడు ఆ కేసు విచారణకు రాగా దేవినేని ఉమా తరుపు న్యాయవాది వాదిస్తూ జరిగిన ఘటన లో ఎవరికీ ఘాయాలు కానప్పుడు 307 హత్యాయత్నం సెక్సన్ కింద కేసు ఎలా పెదతారంటూ ప్రశ్నించారు.

అంతే కాక ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడంపై  ఆ ఘటన జరిగిన సమయంలో అక్కడికి చేరుకున్న వారి కులం మా క్లైంట్ కి ఎలా తెలుస్తుందంటూ వాదించారు. అంతే కాక తమ క్లైంట్ ను రాజకీయ కక్ష తో పలు నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని తమ క్లైంట్ కు బెయిల్ మంజూరు చెయ్యాలని దేవినేని ఉమ తరపు న్యాయవాది కోర్ట్లులో వాదించారు.

ఇక ఈ కేసుపై ప్రభుత్వ తరపు న్యాయవాది వాదిస్తూ దేవినేని ఉమపై ఎస్సీ, ఎస్టీ సెక్షన్ విధించంతో అది ఎస్సీ. ఎస్టీ కోర్టులో ఇప్పటికే పిటిషన్ ఉందంటూ కోర్టుకి తెలిపారు. అంతేకాక ఈ కేసుకు సంబందించి ఇంకా విచారించాల్సిన వారు ఇంకా ఉన్నారని అందుకే Devineni Uma ను మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుని కోరారు. అయితే రెండు వైపులా వాదనలు విన్న హై కోర్టు దేవినేని ఉమ కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి..కార్పోరేషన్ల పేరుతో రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు చేసిందంటూ జగన్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ

                        పుల్వామా దాడి సూత్ర దారి మసూద్ అజర్ మేనల్లుడు ఇస్మాయిల్ ను ఎన్కౌంటర్ చేసిన బలగాలు      

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular