AP Inter Results 2021 : కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో విధ్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు సూచనలను అనుసరించి ఏపీ లోని ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23 వ తారీకున సాయంత్రం 4 గంటలకు విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ గారి చేతుల మీదుగా వేలగాపూడిలోని పబ్లిసిటీ సెల్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ నాల్గవ బ్లాక్ లో 4గంటలకు Intermediate ద్వితీయ సంవత్సర పరీక్షా పలితాలను విడుదల చేయనున్నారు. దీనికి సంబందించిన ప్రెస్ నోట్ ను నేడు రిలీజ్ చేయడం జరిగింది.
ఇక Intermediate Second Year Students మార్కుల విషయానికొస్తే ఇంటర్ మొదటి సంవత్సరంలో వచ్చిన మార్కులు మరియు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్ పాయింట్లను కేటాయించనున్నారు. ఇక కంపార్ట్మెంటల్ లో ఫీజు కట్టిన విదార్దులకు ఎస్.ఎస్.సీ మార్కుల ఆధారంగా గ్రేడులు ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
విద్యార్ధులు తమకు ఇప్పటికె వచ్చిన మార్కులతో సంతృప్తి చెందని యెడల తిరిగి పరీక్షలను రాసుకునే వెసులుబాటు Intermediate Board విద్యార్ధులకు కల్పించనుంది. ఇక ఫలితాలను వెబ్సైటు లో చూడాలనుకునేవారు ఈ క్రింది తెలిపిన వెబ్సైటు లింక్ ద్వారా రిజల్ట్స్ పొందవచ్చు.
