ఇక పై భారీగా ట్రాఫిక్ ఫైన్లు…మరి ఈ రోడ్ల పరిస్థితికి ఎవరిపై వెయ్యాలి ఫైన్..

0
228
andhra pradesh raffic fines
andhra pradesh raffic fines

2019 లో కేంద్రం వాహనాల చట్టాన్ని కటినతరం చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం దానిని మరింత కటినతరం చేసింది. అంతేకాక జరిమానాలను సైతం భారీగా పెంచింది. జగన్ సర్కార్ తీసుకునే చర్యలకు ఒక విధంగా నేడు ప్రజల జీవితాలు అందకారంలోకి వెళుతున్నాయి.

చదువుకున్నవాడికి ఒక్క ఉద్యోగం లేక రోడ్డున తిరుగుతుంటే, ఇక చదువు లేని వాడు చేయడానికి పనులు లేక రోడ్డున పడ్డ పరిస్థితి తలెత్తింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మరో 30సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక్కినేట్టిన ఘనత ఈ ప్రభత్వానికే చెందుతుంది.

ఎన్నికలకు ముందు చంద్రబాబు హయాంలో ఇసుకలో భారీ కుంభకోణం జరిగిపోయిందంటూ 6 వేల రూపాయలు వసూలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని తనకు వోట్లు వేస్తే తక్కువ రేటుకే ఇసుకని అందిస్తామని చెప్పి ఇప్పుడు ఏకంగా 20వేల వరకూ పెంచిన జగన్ సర్కార్ ప్రజల నోట్లో ఇసుక కొట్టినవాడనే చెప్పాలి.

తాజాగా ప్రభుత్వ ఖజానా నింపడానికి దారులు వెతుకుతున్న జగన్ సర్కార్ కి వెతకభోయే తీగ కాలికిందే ఉన్నట్లు నేడు వాహనాల నిభందనలు అంటూ భారీ జరిమానా వసూలుకు రంఘం సిద్దంచేసింది. వీటిలో వాహనాలను చేక్కింగ్ చేసేటప్పుడు విధులకు ఆటంకం వస్తే రూ. 750, అడిగినప్పుడు సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తే రూ. 750, ఎలాంటి అనుమతులు లేకుండా వేరే వారికి మీ వాహనం ఇస్తే రూ. 5000, తక్కువ వయసున్న చిన్న పిల్లలకు వాహనం ఇస్తే రూ. 10,000 ఇలా అనేక ఇంటర్నేషనల్ రూల్స్ ని ఫాలో అవ్వక తప్పదంటూ ప్రభుత్వం హెచ్చరించింది.

ఒకరకంగా వాహన నిభంధనల చట్టం కటిన తరం చేయడంలో తప్పులేదు. కాని ప్రభుత్వ ఆదాయం కోసం ఈ స్థాయిలో ప్రజల నుండి గుంజడం కరెక్టు కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే జగన్ సర్కార్ మద్య నిషేధం పూర్తిగా విఫలం అయిన జగన్ సర్కార్ ఇదికూడా అలాంటిదేనని భావిస్తున్నారు. ఒక వైపు రోడ్లు వేస్తామంటూ పెట్రోల్ రేటు పెంచి నేడు రోడ్డుపై వెల్లాలంటే భయపడే స్థాయికి వచ్చాము. అసలు రోడ్లపై నడవడానికే గతి లేనప్పుడు ప్రభుత్వం ఈ భాదుడు దేనికనే సామాన్య జనం ఆవేదన కలగక మానదు.

    Read also… నేడు హైకోర్టులో జగన్ సర్కారుకు మరో మొట్టికాయ….