ఏపీ లో తాజాగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నాయకులు, ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసే జీవోలను ఆన్లైన్ వెబ్సైట్ లో ఇకపై పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబందించి అన్ని శాఖల సెక్రటరీలకు ఇప్పటికే ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
గత కొన్నిరోజుల నుండి రహస్య జీవోలు, బ్లాంక్ జీవోలు జారీ చేసిన ప్రభుత్వం వాటిని దుర్వినియోగం చేస్తుందంటూ టీడీపీ నాయకులు గవర్నర్ కు పిర్యాదు కూడా ఇచ్చారు. జీవోల విషయంలో జగన్ ప్రభుత్వంపై ఇప్పటికే చాలా వ్యతిరేకత మొదలైంది. దీనికి చాలా కారణాలే ఉన్నాయి దేవాదాయ భూముల విషయం, అక్రమ నిర్మాణాలంటూ దొరికిన వాటిని దొరికినట్లు కూల్చి వెతలు, కార్పోరేషన్ల పేరిట ప్రభుత్వం చేసే అప్పుల జీవోలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారడం రాష్ట్రం అప్పుల కుప్పగా మారడంతో ఈ జీవోలను ప్రజలకు ప్రతిపక్ష నాయకులకు ఇకపై ఇవి కనిపించకుండా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
గత కొన్నిరోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక శాఖలోని కొందరు రాష్ట్ర ఆర్ధిక విషయాలు బయటకు వెల్లడిస్తున్నారని వారిని ఆ పోస్టుల నుంచి తొలగించగా నేడు జీవొలు ప్రజలకు తెలియకూడదని పబ్లిక్ డొమైన్ నుండి తీసివేయడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతూ ఇకపై దేవాదాయ భూములు, ఆదాయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరప్షన్ జరగకుండా దేశం మొత్తం మా వైపు చూసే విధంగా ట్రాన్స్పరెన్సీ తో ప్రతీ పనీ ప్రజలకు తెలిసేలా ఈ ప్రభుత్వం చేస్తుందని డప్పు కొట్టుకున్న జగన్ ప్రభుత్వం నేడు ఏ కారణం చేత ప్రజలకు కనిపించకూడని పనులు చేస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు సందిస్తున్నారు.
Read also…