శనివారం, జూలై 27, 2024
Homeసినిమాటాలివుడ్ కి ఏపీ ప్రభుత్వం భారీ షాక్...బెనిఫిట్ షోలు రద్దు...ఏపీ లో పెద్ద సినిమాలు ఇక...

టాలివుడ్ కి ఏపీ ప్రభుత్వం భారీ షాక్…బెనిఫిట్ షోలు రద్దు…ఏపీ లో పెద్ద సినిమాలు ఇక మటాష్

Latest Tollywood News: ఏపీ గవర్నమెంట్ నేడు టాలివుడ్ కి భారీ షాక్ ఇచ్చింది. ఏపీ వ్యాప్తంగా ఉన్న దియేటర్లలో ఇకపై బెనిఫిట్ షో లను రద్దు చేస్తూ తీసుకు వచ్చిన బిల్లును అసెంబ్లీలో పేర్ని నాని ప్రవేశ పెట్టారు. అయితే అసెంబ్లీ లో మంత్రి పెర్ని నాని మాట్లాడుతూ ఇప్పటివరకూ టిక్కెట్టు దొరికిన లేకపోయినా దియేటర్ కి వెళ్లి టిక్కెట్టు తీసుకుని సినిమా చూసేవారు అయితే ఇప్పుడు ఆన్లైన్ లో ఇంటినుండే టిక్కెట్టు బుక్ చేసుకుని దొరికితేనే దియేటర్ కి వెళ్ళే సౌలభ్యం ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వం కేవలం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (Film Development Corporation) అనే ప్రభుత్వ సంస్థ ఆధారంగా కొత్త పోర్టల్ తీసుకువస్తున్నామని తెలిపారు. అయితే ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వం దీనిని మెయిన్ టైన్ మాత్రమె చేస్తామని దీని ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వం తీసుకోదని తెలిపారు.

ఇక ఈ ఆన్లైన్ పోర్టల్ ప్రభుత్వం ప్రవేశ పెట్టడంపై ఇప్పటికే వివాదం చెలరేగింది ప్రధానంగా ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వం బ్యాంకుల నుండి ఋణం తీసుకోవడానికే ఇలాంటి పనులు చేస్తుందని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అసెంబ్లీలో పెర్ని నాని ఈవిషయంపై మాట్లాడుతూ ఈ పోర్టల్ ద్వారా ఎలాంటి లోన్ లను తమ ప్రభుత్వం తీసుకురాదని అసెంబ్లీలో తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆన్లైన్ పోర్టల్ లో ఇకపై అంధరకీ ఒకే పోర్టల్ ఉంటుంది. ఒకవేళ ప్రేక్షకుడు దియేటర్కి వెళ్ళినా దియేటర్ వద్ద కూడా ఇదే గవర్నమెంట్ పోర్టల్ నుండి వారు టిక్కెట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాక ఇకపై దియేటర్ లో రోజుకు నాలుగు షో లను మాత్రమె అనుమతిస్తూ బెనిఫిట్ షోలను ఇకపై రద్దు చేశారు.

అయితే ప్రత్యేకించి కొన్ని చారటీల నిమిత్తం వచ్చే సినిమాలకు పర్మిషన్ తో అనుమతి ఉంటుందని తెలపగా ఈ బిల్లును వోటింగ్ ద్వారా స్పీకర్ ఆమోదించారు. గత కొద్ది కాలంగా టాలివుడ్ లో రిలీజ్ అయిన సినిమాల విషయంలో సినిమా యూనిట్ తమ సినిమా 100 కోట్లు 200 కోట్లు కలెక్షన్స్ రాబట్టిందంటూ చెబుతూ ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ మాత్రం ఆ కలెక్షన్స్ తో అసలు సంభంధం లేకుండా కడుతున్నారని అందుకే ఈ పోర్టల్ తీసుకు వచ్చారని తెలుస్తోంది.  

తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సినిమా డిస్టిబ్యూటర్లు తలపట్టుకుంటున్నారు. కరోనా మహమ్మారితో సుమారు రెండు సంవత్సరాల నుండి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా దియేటర్లు పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఇప్పటికీ నామమాత్రం గానే షో లు నడుస్తున్నాయి. వచ్చే సంక్రాంతి సీజన్ తో గట్టేక్కుదామని అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయం దియేటర్ యాజమాన్యానికి కోలుకోలేని దెబ్బగా మారింది.

ఇప్పటివరకూ సాధారణ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ పేరుచెప్పి టికెట్ల రేట్లు పెంచి ప్రేక్షకులను భారిగా దోచుకున్నాయని ఇకపై ఇలాంటి వాటికి బ్రేక్ పడిందని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సమర్దిస్తుండగా మరికొంతమంది ఇదంతా రాజకీయంగా కొందరిని టార్గెట్ చెయ్యడానికే నంటూ రాష్ట్రంలో నిత్యావసర వస్తువులైన కూరగాయలు, పెట్రోల్ ధరలు మండిపోతుంటే వాటిని నియంత్రించకుండా సినిమా ఇండస్ట్రీ లోని కొందరిని దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తున్నారంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఇక ఇదంతా ఒక ఎత్తైతే చిన్న సినిమాలకు ప్రభుత్వ నిర్ణయంతో పెద్దగా లాస్ లేకపోయినా డిసెంబర్ మరియు జనవరిలో రిలీజ్ కాభోతున్న భారీ సినిమాలలో ఆర్.ఆర్.ఆర్, రాదేశ్యామ్, బీమ్లా నాయక్, మరియు పుష్ప వంటి సినిమాలకు ఇది భారీ ఎదురుదెబ్బగా చెప్పుకోవాలి. ఏదేమైనా ప్రభుత్వ నిర్ణయం కొంతమందికి ఇష్టంగా కొంతమందికి కష్టంగా మారింది. ప్రభుత్వ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలుపగలరు.

 

           

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular