శనివారం, జూలై 27, 2024
Homeరాజకీయంఅసెంబ్లీ సమావేశాల్లో బాలయ్య నిరసన ...అసెంబ్లీ నుండి సస్పెండ్

అసెంబ్లీ సమావేశాల్లో బాలయ్య నిరసన …అసెంబ్లీ నుండి సస్పెండ్

2023-2024 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో నేడు అసబ్లీ సమావేశం రసాభాసగా మారింది. ఆర్ధిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేసపెట్టకముందే టీడీపీ నేతలు బడ్జెట్ ను ఉద్దేశించి నినాదాలు చేస్తూ అసంబ్లీని హోరెత్తిస్తూ స్పీకర్ పోడియం వద్దకు చేరుకొని పేపర్లు విసురుతూ నిరసన తెలిపడంతో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఏం జగన్ వెంటనే టీడీపీ నేతలను సస్పెండ్ చెయ్యాలని స్పీకర్ కు తెలపడంతో బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, అశోక్, ఆదిరెడ్డి భవాని, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, జోగేశ్వర రావ్, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణ బాబు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, వీరాంజనేయ స్వామి వంటి మొత్తం 14 మంది టీడీపీ నేతలను ఒక రోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు.

అయితే బడ్జెట్ సమావేశానికి కొంత సమయం ముందు అసంబ్లీ బయట “జగన్ రెడ్డి కళ కళ-ప్రజలు గిల గిల” “రోడ్డు డెవలప్మెంట్ అప్పు 6858కోట్లు”, “కాంట్రాక్టర్లకు బిల్లుల బకాయిలు 86500కోట్లు” “ అప్పుల ఆంధ్రప్రదేశ్” వంటి ప్లకార్డులను ప్రదర్శిస్తూ వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అయితే ఎలక్షన్ చివరి బడ్జెట్ కావడంతో భారీగా పెంచినట్లు వైసీపీ చెబుతోంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular