గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeఅంతర్జాతీయంభారత శత్రు దేశం టర్కీ ప్రధాన మహిళను కలిసిన అమీర్ ఖాన్.. రగిలిపోతున్న దేశ వాసులు

భారత శత్రు దేశం టర్కీ ప్రధాన మహిళను కలిసిన అమీర్ ఖాన్.. రగిలిపోతున్న దేశ వాసులు

బాలివుడ్ హీరో అమీర్ ఖాన్ తన కొత్త చిత్రం షూటింగ్ నిమిత్తం టర్కీ వెళ్ళారు అయితే అక్కడి రాష్ట్రపతి భార్య (దేశ ప్రదాన మహిళ) అమీన్ ఏర్దోగాన్ తో బేటి అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం పై దేశ వ్యాప్తంగా సాదారణ ప్రజలతోపాటు అమీర్ ఖాన్ ఫ్యాన్స్ సైతం ఆయనపై మండిపడుతున్నారు.

పూర్తి వివరాలలోకి వెలితే అమీర్ ఖాన్ తాజా సినిమా లాలా సింగ్ చడ్డా మూవీలోని చివరి పార్ట్ మిగిలిపోవడంతో టర్కీ లో చివరి భాగాన్ని పూర్తి చేయడానికి అక్కడకు వెళ్ళారు అయితే టర్కీ రాష్ట్రపతి భార్య ను కలిసిన ఫోటో అమీన్ ఏర్దోగాన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి అమీర్ ఖాన్ తో మీటింగ్ పై ఆమె ఆనందం వ్యక్తం చేసారు, అయితే ఆమె ఈ విషయాలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియా వేదికగా అమీర్ ఖాన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.

ప్రస్తుతం టర్కీ భారత్ కు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నట్లు మీకు తెలియదా అంటూ పాకిస్థాన్ తో కలిసి కాశ్మీర్ విషయంపై ఆర్టికల్ 370 విషయంలో భారత్ ను నిందించిన టర్కీ వెళ్లి సినిమా షూటింగ్స్ తీసుకుని దేశ ప్రజలకు తప్పుడు సంకేతం ఇచ్చారంటూ అమీర్ ఖాన్ పై మండిపడ్డారు.

మాకు దేశమే ముఖ్యం అంటూ ఇకపై ఖాన్స్ సినిమాలను బ్యాన్ చెయ్యాలంటూ విరుచుకుపడ్డారు. అంతేకాక భారత్ కు చిరకాల మిత్రదేశం ఇజ్రాయెల్ ప్రదాని బెంజమిన్ నేతాన్యహు తో మీటింగ్ ను సైతం మీరు కాదన్నప్పుడే మాకు బాగా అర్ధం అయ్యింది మీరు ఎలాంటివారో అంటూ ప్రశ్నించారు.

ప్రస్తుతం టర్కీ మరియు పాకిస్థాన్ దేశాలు కలిసి భారత్ పై పలు విమర్శలు చేస్తున్నాయి. కాశ్మీర్ విషయంలో సైతం టర్కీ యు.ఎన్.ఏ అసంబ్లీ లో సైతం పాకిస్థాన్ కు మద్దతుగా భారత్ దౌర్జన్యంగా వ్యవహరిస్తుందని వాదించింది. అంతేకాక పాకిస్థాన్ ను గ్రే లిస్ట్ నుండి బయటపడడానికి టర్కీ మద్దతు ఇస్తుందని ప్రకటించింది.

కొన్ని ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియాకి వ్యతిరేకంగా పనిచేసే దుష్ట శక్తులకు సైతం టర్కీ ఫండ్ ఇస్తునట్లు ఒక నివేదికలో బయటపెట్టింది. ఒక వైపు భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు టర్కీ పై అనేక ఆర్ధిక ఆంక్షలు సైతం విధించింది. ప్రస్తుతం అమీర్ ఖాన్ ఆదేశం వెళ్లి వారితో బేటి కావడంతో పలువురు అమీర్ ఖాన్ పై మండి పడుతున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular