శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeఅంతర్జాతీయంభారత్ కు అండగా అమెరికా...10వేల మంది జవాన్లను పంపడానికి సిద్దం

భారత్ కు అండగా అమెరికా…10వేల మంది జవాన్లను పంపడానికి సిద్దం

గత కొద్ది రోజులుగా లద్దాక్ లో భారత సైనికులపై దాడి మరియు భారత భూబాగాన్న ఆక్రమించుకునే ప్రయత్నాలు చైనా చేయడం అంతేకాక వియత్నాం, ఫైలిఫీన్స్, మలేసియా వంటి దేశాల భూబాగం ఆక్రమించుకొంది. ఆయా దేశాల దీవులను సైతం తమ దీవులుగా చెబుతూ వాటిపై ఆదిపత్యం చెలాయిస్తుంది. కొన్నాళ్ళుగా భారత్ పై ఆదిపత్యం చేలాయించాలని చూస్తున్న చైనా వ్యవహారాన్ని సైలెంట్ గా గమనిస్తున్న అమెరికా తాజాగా చైనా దురఅహంకారానికి ఇక చరమగీతం పాడాలని నిర్ణయించుకుంది.

దీనిలో భాగంగా అమెరికన్ సెక్రెటరీ మైక్ పాంపియో నిర్వహించిన సమావేశంలో అమెరికాకు సంబందించిన సైన్యం జర్మనీలో 30వేల మంది ఉండగా వారిలో 10వేల మందిని వెనక్కి తీసుకోవాలని బావిస్తున్నట్లు తెలిపారు. తమ మిత్రదేశమైన భారత్ ను చైనా తన ఆదిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తోందని అవసరమైతే భారత్ లోని  ఎల్ఏసీ వద్దకు వారిని తరలిస్తామని చెప్పారు.

అంతేకాక దక్షిణ చైనా సముద్రంలో తన పట్టు నిలుపుకునేందుకు చైనా కృత్రిమ దీవులను సృష్టించి అక్కడ చైనా ఆర్మీ బేస్ లను ఏర్పాటుచేసి వాటిని తన స్వాదీనంలోకి తీసుకోవడంతో ఇప్పుడు అమెరికా చైనాకు చెక్ పెట్టేందుకు ఫిలిఫీన్స్, వియత్నాం, మలేషియా వంటి దేశాలలో అమెరికా తన దళాలను రంగంలోకి దింపనుంది. అంతేకాక దక్షిణ చైనా సముద్రంలో అమెరికా తన నేవీలోని యుద్ద నౌకల పెట్రోలింగ్ ను ఇకపై మరింత పెంచనుంది.

అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా స్పందిస్తూ ఇప్పటివరకూ ఇంతమంది అమెరికా దళాలను దక్షిణ చైనా చుట్టూ మొహరించడం ఇదే మొదటిసారని, చైనా నేవీ కి ఇది పెద్ద రిస్క్ గా చైనీస్ సీనియర్ అధికారి తెలిపారు. అంతే కాక కొన్నాళ్ళ క్రితం భారత్ అమెరికా దేశాలు ఒక అగ్రిమెంట్ చేసుకున్న విషయం తెలిసిందే ఈ అగ్రిమెంట్ లో భారత్ లోని బేస్ లను అమెరికా ఉపయోగించుకుంటే అమెరికన్ బేస్ లను భారత్ ఉపయోగించుకునేందుకు రెండు దేశాలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. దీనిలో బాగంగానే అత్యవసర యుద్ద సమయాల్లో అమెరికా నుండి ఆయుధాలను, బలగాలను డైరెక్ట్ గా ఇండియాకు తరలించవచ్చు.

Read also……

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular