మంగళవారం, జూన్ 18, 2024
Homeసినిమాసినీ ప్రముఖులకు రాజదాని రైతుల నిరసన సెగ

సినీ ప్రముఖులకు రాజదాని రైతుల నిరసన సెగ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారితో టాలివుడ్ సినీ ప్రముఖుల సమావేశం అయ్యారు .  తాడేపల్లిలోని సీఎం  ఆఫీస్‌లో‌ చిరంజీవితో పాటు కొంత మంది టాలీవుడ్‌ హీరోలూ, డైరెక్టర్లూ, మరియు నిర్మాతల బృందం ముఖ్యమంత్రిని కలిశారు. ఏపీలో షూటింగ్‌లకు సింగిల్‌ విండో అనుమతి ఇచ్చినందుకు గాను సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలపారు.

అదేవిధంగా ప్రస్తుతం టాలీవుడ్‌లోని సమస్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి మెగాస్టార్‌ చిరంజీవితో పాటుగా నాగార్జున మరియు సురేష్‌ బాబు, రాజమౌళి, సి.కళ్యాణ్‌, దిల్‌ రాజు తదితరులు హాజరయ్యారు.

అంతేకాక వీటితో పాటు ఎయిర్ పోర్టు సమీపంలో ఏపీ సినీ పరిశ్రమ నెలకొల్పడానికి కావాల్సిన భూములపై కూడా సానుకూలం గా స్పందించారన్నారు.  అయితే అక్కడి నుండి తిరిగి హైదరాబాద్ వెళ్లే క్రమంలో గోకరాజు గంగరాజు అతిది గృహానికి చేరుకున్న వీరి వద్దకు అమరావతి రాజధాని సమీప గ్రామాల రైతులు రోడ్డుపై బైటాయించి రైతులకు మద్దతు తెలపాలని నిరసనలు చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

అయితే రాజధాని రైతులు 175 రోజులుగా ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిరసనలు చేస్తుంటే అదేమీ పట్టనట్టు ఇప్పుడు మీకు అవసరమైన సినిమాల కోసం ఇక్కడికి ఎలా వచ్చారని విమర్శించారు. మేము చూసిన సినిమాల మాడబ్బులతో మీరు సినిమాలు తీసుకుని బతుకుతున్నారని.. రైతులకు మాత్రం ఒక్కరుకూడా సానుభూతి తెలిపేదన్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular