Alluri Sitarama Raju : రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజాన్ని గడగడలాడించిన అగ్గిపిడుగు, బ్రిటీష్ వాళ్ళ పాలిట సింహ స్వప్నం Alluri Sitarama Raju. గిరిజనులను ఒక గెరిల్లా యోధులుగా మార్చి తెలుగు నేలకు స్వతంత్ర పోరాట మార్గం చూపిన విప్లవ జ్యోతి.
ఒక్క అల్లూరి సీతారామరాజు ని పట్టుకునేందుకు బ్రిటీష్ ప్రభుత్వం అస్సాం రైఫిల్స్, మలబారు స్పెషల్ పోలీసులు, బళ్లారి, కోరమండల్, ఈస్ట్‑కోస్ట్ రైఫిల్స్, కోరాపుట్ రిజర్వు పోలీసులను రంగంలోకి దింపింది. తనపై పోలీసులు దాడి చేయాలనుకున్న ప్రతీసారీ అల్లూరి ఎంతో చాకచక్యంగా తప్పించుకుని ఉద్యమాన్ని కొనసాగించి ఎందరో అమాయకపు గిరిజనులకు అండగా నిలిచారు.
- ఉద్యమంలో Alluri Sitarama Raju ముఖ్య పాత్ర
అవి భరతమాత తెల్లోడి కబంద హస్తాల్లో నలిగిపోతున్న రోజులు ఉత్తర భారతంలో స్వతంత్రోధ్యమం అత్యంత ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రోజులు అవి అలాంటి సమయంలోనే పశ్చిమ గోదావరి జిల్లా అడవుల్లో ఓ అగ్నికణం పుట్టింది.
ఆ అగ్ని కణమే దావాణలంలా వ్యాపించి బ్రిటీష్ సామ్రాజ్య వాదుల గుండెల్లో దడ పుట్టించేలా చేసింది. తెల్లోడి పెత్తనాన్ని ఎదురించి గర్జించిన మన తెలుగు తేజమే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నేడు ఆ విప్లవ వీరుని జయంతి సందర్భంగా ఆయన త్యాగాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
2. Alluri జననం
1897 జూలై 4వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి సమీపాన మోగల్లులోని పాండ్రంకిలో అల్లూరి వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించారు. అల్లూరి జీవితం మొత్తం స్వాతంత్ర్య పోరాటాలతోనే సాగింది.
Alluri Sitarama Raju ఒక వ్యక్తి కాదు మన్యం ప్రజల్లో విప్లవ జ్వాలను రగిలించిన మహోజ్వల శక్తి. బ్రిటీషు వారి కభంద హస్తాల నుండి భరత మాతకు పూర్తి స్వేఛ్చ కోసం తన ప్రాణాలను పణంగాపెట్టి తెల్లదొరలు గుండెలు చీల్చాడు. సాయుధ పోరాటం ద్వారా తెల్ల దొరల కంటి మీద కునుకు లేకుండా చేసి వారిపై పోరాటం చేసాడు.
3. బ్రిటీషు పోలీసుల తూటాలకు బెదరని అల్లూరి-Alluri Sitarama Raju Jayanthi
మన్యం ప్రజల హక్కులను బ్రిటీషు వారు కాలరాస్తుంటే వారిపై ఎదురుతిరిగి పోరాడాడు. ఆయనతో పాటు మన్యం ప్రజల్లో కూడా చైతన్యాన్ని తీసుకు వచ్చి పన్ను అడిగిన బ్రిటీషు వారిపై ఎదురు తిరిగేలా చేసి వారికి గెరిల్లా యుద్ద పోరాటాలను నేర్పించి వారిని స్వాతంత్ర పోరాట యోధులుగా తయారు చేసి బ్రిటీషు వారి పోలీస్ స్టేషన్స్ పై దాడులు చేసేవారు.
ఆయుదం చేతిలో లేని అల్లూరిని కూడా ఎదిరించలేని బ్రిటీష్ పోలీసులు ఆయన చెట్టు కట్టేసి తుపాకులు ఎక్కుపెట్టి తూట్లు తూట్లు గా కాలుస్తున్నా బెదరలేదా మన్యం పులి తన గుండెలు చూపి ఇక్కడ కల్చండ్రా అంటూ తుపాకీకి ఎదురెళ్ళిన ధైర్యశాలి రామరాజు.
4. మన్యం ప్రజల్లో దైర్యం రగిల్చిన అల్లూరి- Alluri Sitarama Raju Jayanthi
నిర్ధాక్షన్యంగా పిరికిపందల్లా బ్రిటీష్ అధికారులు అల్లూరిని చంపగలిగారుగానీ ఆయన ప్రజల్లో రగిలించిన స్వతంత్ర కాంక్షను మాత్రం ఆర్పేయలేకపోయారు.. తెలుగు నేల మీద కూడా స్వతంత్ర సమరానికి బీజాలు వేసిన మహానాయకుడు అల్లూరి.
నేడు ఆయన జయంతి సందర్భంగా ఆ మహానాయకుని, స్వాతంత్ర సమరయోధుడిని మరొక్కసారి గుర్తుచేసుకుంటూ విప్లవవీరుడికి ఘన నివాళి ఆర్పిస్తూ ఓ అల్లూరి సీతారామరాజ మీ పోరాట ఫలంతో సిద్దించిన ఈ స్వాతంత్ర రాజ్యంలో మరోసారి మీరు పుట్టాలని ఆకాంక్షిస్తున్నాం.