అల్లూ వారి వారసుడి బర్త్ డే ఇంట్లోనే, ఎమోషనల్ అయిన Allu Arjun

0
124
allu ayaan birthday celebrations at home
allu ayaan birthday celebrations at home

చిన్న పిల్లల పుట్టినరోజు అంటే ఇంట్లో ఉండే ఆ కోలాహలమే వేరు భలే హడావిడిగా ఉంటుంది కొత్త బట్టలు, కేక్ చాక్లెట్లు ఇలా ప్రతీది వాళ్లకి ఓక గొప్ప బహుమతిగా కనిపిస్తుంది. కానీ కరోనా కారణంగా లాక్ డౌన్ వల్ల ఇప్పుడు అవన్నీ జరుపుకునే పరిస్థితి లేదు కాబట్టి పిల్లల పుట్టినరోజులు ఇప్పుడు తల్లిదండ్రులు సరదాగా ఇంట్లోనే జరుపుతున్నారు.

ప్రస్తుతం Allu Arjun కూడా అంతే తన కొడుకు Allu Ayaan పుట్టినరోజును తన ఇంట్లోనే సాదా సీదా గానే జరిపాడు ఎవ్వరిని పిలవకుండా కేవలం భార్యతో కలిసి అయాన్ తో ఇంట్లో తయారు చేసిన కేక్ ని కట్ చేయిస్తూ ఆ ఫొటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేశాడు.దీనిలో ప్రేమ అంటే ఏమిటి? అని నేను నా జీవితం లో చాలా సార్లు ఆలోచించాను. గతంలో అనేక సార్లు గొప్ప భావాలను నేను ఆస్వాదించాను కానీ అది ప్రేమో కాదో నాకు ఇప్పటికీ తెలీదు కానీ, నువ్వ నా జీవితంలోకి వచ్చినప్పటి నుండి  ప్రేమ అంటే ఏమిటో నాకు ఇప్పుడు తెలిసింది.

నువ్వే నా ప్రేమ ఐ లవ్ యూ అయాన్. హ్యాపీ బర్త్‌డే మై బేబీ’’ అని Allu Arjun తన కొడుకు గురించి ట్విట్టర్ లో పోస్ట్‌లో పేర్కొన్నారు. మరోవైపు Allu Arjun Wife స్నేహారెడ్డి కూడా ‘‘హ్యాపీ బర్త్‌డే మై బేబీ’’ అంటూ అల్లూ అయాన్ కేక్ కట్‌ చేస్తున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా’ పోస్ట్ చేశారు.

ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలో అయాన్‌తో సహా బన్నీ, స్నేహారెడ్డి, అర్హలు కూడా ఇందులో  ఉన్నారు.