మంగళవారం, జూన్ 18, 2024
Homeసినిమాఅల్లూ అర్జున్ కొత్త సినిమా కబురు వచ్చేసిందహో

అల్లూ అర్జున్ కొత్త సినిమా కబురు వచ్చేసిందహో

టాలివుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జన్ మరియు సుకుమార్ కలయికలో వస్తున్న మూడవ సినిమా ఇది అలా వైకుంఠపురం తో భారీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్లో నటిస్తున్నాడు. దీనిలో అల్లు అర్జున్ పొడవైన జుట్టు మరియు గుబురు గెడ్డంతో లారీ డ్రైవర్ క్యారెక్టర్ లో పక్కా మాస్ గా కనిపించనున్నాడు.

లాక్ డౌన్ నేపద్యంలో షూటింగ్ పోస్ట్ ఫోన్ చేసిన చిత్ర బృందం త్వరలో శేషాశలం అడవుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. గత కొన్నాళ్లుగా అల్లు అర్జున్ నుండి ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో ఫాన్స్ నిరాశకు లోనయ్యారు.

అయితే కొంత మంది తమ నైపుణ్యాన్ని బయట పెట్టి అల్లు అర్జున్ కొత్త సినిమా పోస్టర్ రేంజ్ లో ఒక పోస్టర్ తయారు చేయడం తో అది చూసిన చిత్రబృందం ఒక్క సారిగా అవాకయ్యింది కొంత మంది ఫాన్స్ ఆఫీసియల్ పోస్టర్ అనుకోని షేర్స్ చేస్తూ తెగ ఆనందపడిపోయారు.

దీనిని చూసిన అల్లు అర్జున్ ఆనందం వ్యక్తం చేస్తూ ఫాన్స్ కోరికను త్వరలోనే తీరుస్తామన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్తను చిత్ర బృందం ఎనౌన్స్ చేసింది. ఈ నెల 8న  అల్లు అర్జున్ బర్త్డే రోజున మూవీ టైటిల్, అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనుంది.

అయితే చిత్ర బృందం ఒక ఆశక్తి కర పోస్టర్ రిలీజ్ చేసింది దానిలో మీఋ ఎప్పుడెప్పుడా అని చూస్తాండే అల్లు అర్జున్ 20వ మూవీ అప్ డేట్ ఏప్రిల్ 8న తెల్లర్తో 9గంటలకు వస్తాండాది. రెడీ కాండబ్బా .. అంటూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసారు. దీనిని గమనిస్తే అల్లు అర్జున్ డిఫరెంట్ స్లాంగ్ లో వాయిస్ ఉండబోతుందని తెలుస్తుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular