పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన అల్లరి నరేష్

0
202
allari naresh shabhaku namaskaram poster అల్లరి నరేష్
allari naresh shabhaku namaskaram poster అల్లరి నరేష్

అల్లరి సినిమాతోనే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు అల్లరి నరేష్ ఆ సినిమా తనకు మంచి పేరు తీసుకు రావడంతో సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. అయితే అక్కడినుండి వరిసపెట్టి కామెడీ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ గా నిలిచారు.

తన తండ్రి దివంగత ఇ.వీ.వీ.సత్యనారాయణ గారు మరణం తరువాత నరేష్ నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్స్ కాలేకపోయాయి. ఒకానొక సమయంలో Allari Naresh ఫేడ్ అవుట్ అయిపూయాడనే స్టేజి కి వెళ్ళిపోయాడు. అలాంటి సమయంలో మహర్షి సినిమా ఊపిరి పోయ్యగా నాంది సినిమాతో మళ్ళీ బౌన్సు బ్యాక్ అయ్యాడు అల్లరి నరేష్.

నేడు నరేష్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా “సభకు నమస్కారం” నుండి పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో సభలో ప్రసంగిస్తున్న నరేష్ రెండు జోభులలో నోట్ల కట్ట మరియు మందు సీసా ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్ అయితే ఈ పోస్టర్ ను చూస్తే నేటి రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో సాగే కధగా తెలుస్తోంది.

ఇప్పటికే నాంది సినిమాలో మంచి పెర్ఫార్మెన్స్ కనబరచి విమర్శకులనుండి కూడా ప్రసంసలు పొందాడు. అతితే ఈ సినిమా కామెడీకి స్కోప్ ఉంటుందా లేక నాంది సినిమాలా సీరియస్ కేరెక్టర్ లోనే ఉంటుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా ఈ సినిమాతో అల్లరి నరేష్ మరో బ్లాక్ బాస్టర్ కొట్టాలని కోరుకుంటూ ప్రజావారధి తరపున అల్లరి నరేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.