MAY Day అంటే కేవలం కార్మికులకు సెలవుదినం కాదు. కార్మిక సోదరులు తమ హక్కుల కోసం ఏళ్ల తరబడి చేసిన పోరాటానికి ప్రతిఫలం. పెత్తందారులు, పెట్టుబడిదారులు కార్మికుల శ్రమను దోచుకునేవారు కార్మికుకు గంటలతరబడి పనిచేస్తూ శ్రమ దోపిడీకి గురైయ్యేవారు. ఈ నేపథ్యంలో వాళ్ళ హక్కులకోసం పోరాడి ఎన్నో ఆటుపోట్ల ఎదుర్కొంటు రోజుకు 8 గంటల పనిదినం కోసం, వాళ్ళ హక్కులకోసం పోరాడారు.
ఇక మొట్టమొదట 1923 లో మేడే ను నిర్వహించారు. ఇక అప్పటినుంచి కార్మికుల తరపున వచ్చిన చట్టాలు వాళ్లకు బాసటగా నిలిచాయి. ఎంతో శ్రమిస్తూ రాత్రిపగలు పనిచేసే కార్మికులు దేశ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తుంటారు. తమ చెమటతో పరిశ్రమల అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ప్రతిక్షణం కష్టపడే కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు.