శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeఅంతర్జాతీయం42000 దాటిన మరణాలు పరిస్థితి మిరే చుడండి..

42000 దాటిన మరణాలు పరిస్థితి మిరే చుడండి..

ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశాన్ని కదిపినా ఏ రాష్ట్రాన్ని పలకరించినా ఏమనిషి నోట విన్నా ఒకేఒక్క మాట వినిపిస్తుంది, అందరిని భయపెడుతోంది అదే కరోనా. అమెరికా నుంచి అత్తిలి వరకు ప్రతి ఒక్కరిని ఈ మహమ్మారి గడగడలాడిస్తోంది ఇప్పటికే చైనాని చుట్టేసి విషాదంలో నెట్టేసిన ఈ వైరస్ ఇటలీని కుదేలు చేసింది. ఇక అమెరికా పరిస్థితి కూడా చాల దయనీయంగా తయారైంది.

ప్రపంచవ్యాప్తంగా 42000 వేల మరణాలు నమోదవ్వగా మృతుల్లో చేయినవాళ్ళే అధికం. ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ వైరస్ మాత్రం తనపని తాను చేసుకుపోతోంది. సగటున ప్రపంచవ్యాప్తంగా రోజుకు 70 వేల కేసులు నమోదు అవుతున్నాయంటే దాని ప్రభావం ఏంటో తెలుస్తోంది. ఇక మొత్తం ప్రపంచ వ్యాప్తంగా  8.50 లక్షల కేసులు నమోదయ్యాయి. విరిలోనుంచి లక్షా డెబ్బై వేలమంది కోలుకున్నారు.

ఐరోపా దేశాల్లో  మొత్తం కరోనా మరణాలు 69 శాతం ఉన్నాయ్. అమెరికాలో ఈ వైరస్ చాల వేగంగా విస్తరిస్తోంది.  ముందు ఐరోపాదేశాల్లో ఎక్కువగా కనిపించిన దీని తీవ్రత క్రమంగా అన్నిదేశాలకు విస్తరిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకి వృద్ధులే ఎక్కువగా మృత్యువాతపడుతున్నారు.

చైనాలోని వుహాన్ మాత్రం కరొనకి భారీమూల్యమే చెల్లించింది లక్ష కి పైగా ప్రాణాలు కేవలం ఒక్క వుహాన్ లో పోవడం బాధాకరం.  అయితే ప్రస్తుతం కొత్త కేసులు దాదాపు 4000 మందిలో కరోనా వైరస్ అని నిర్ధారణ కావడంతో కరోనా సోకినా వారి  సంఖ్య 105,792కి చేరింది.

స్పెయిన్, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ, నెదర్లాండ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా మరణాల్లో స్పెయిన్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. ఇటలీ తర్వాత అమెరికాలోనే అత్యధిక కేసులు మరియు ప్రాణాలు కోల్పోయిన వారు సైతం అధికంగానే ఉంది.

అమెరికాలో ఇప్పటికే 8,464 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం అక్కడ మరో 750 మంది కరోనా సోకి మృతిచెందగా, కొత్తగా మరో 7,000 మందిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో స్పెయిన్‌లో కరోనా  బాధితుల సంఖ్య మరింత పెరిగి 95,923కు చేరింది.

అమెరికాలో కూడా పరిస్థితి ఆందోళన కరంగా ఉంది మంగళవారం ఒక్కరోజే ఏకంగా 24 వేల కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్ న్యూజెర్సీ ప్రాంతాల్లో వైరస్ విజృభించడంతో అక్కడ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.

ప్రస్తుతం అక్కడ కేసుల సంఖ్యా 1.8 కి పైనే అని సమాచారం. వైరస్ వళ్ళ మృతిచెందినవారి సంఖ్య 3500 లకు పైనే ఉండగా కేవలం న్యూయార్క్ లోనే 1800 మంది ప్రాణాలు కోల్పోయారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular