గురువారం, ఫిబ్రవరి 22, 2024
Homeసినిమాఅఖండ సినిమాపై హిందీ ఆడియెన్స్ ఫిదా... వెంటనే హిందీలో డబ్ చెయ్యాలంటూ డిమాండ్

అఖండ సినిమాపై హిందీ ఆడియెన్స్ ఫిదా… వెంటనే హిందీలో డబ్ చెయ్యాలంటూ డిమాండ్

నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం అఖండ. తాజాగా ఈ చిత్రం ఐదు రోజులలో భాక్సాఫీస్ సునామీ కలెక్షన్స్ తో టాలివుడ్ రికార్డులను బద్దలుకొడుతుంది. మొదటి రోజు మాస్ కలెక్షన్స్ తో 15.40 కోట్లు రాబట్టిన ఈ చిత్రం ఐదవ రోజు వచ్చే సరికి ఒక్క ఏపీ-తెలంగాణా లలో సుమారు 42 కోట్ల వసూలు సాదించింది. ఇక వరల్డ్ వైడ్ 72కోట్ల గ్రాస్ రాబట్టి బాలయ్య క్రేజ్ ఎలాంటిదో మరోసారి నిరూపించింది.
తాజాగా ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక బాలివుడ్ మీడియా సైతం ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ అఖండ సినిమాపై పలు ఆర్టికల్స్ పబ్లిష్ చేయడంతో ఒక్కసారిగా బాలివుడ్ సినీ వర్గాల్లో అఖండ సినిమాపై హైప్ పెరిగింది.

అంతేకాక అఖండ సినిమా లోని కొన్ని వీడియోలు, పోస్టర్లు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టగా అవి చూసి బాలివుడ్ ప్రేక్షకులు వెంటనే ఈ సినిమాను హిందీలో డబ్ చెయ్యాలంటూ డిమాండ్ చేస్తూ పోస్ట్లు పెట్టడంతో ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ రైట్స్ 25 కోట్లకు బాలివుడ్ కి చెందిన నిర్మాణ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

అనుల్ సెక్షీనా అనే నార్త్ ఇండియన్ ఫేమస్ ఎథికల్ హెకర్ అఖండ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ జై బాలయ్య అంటూ తన ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టగా ఈ సినిమా పై బాలీవుడ్ ఆడియన్స్ లో మరింత క్రేజ్ ఏర్పడింది. తన పోస్ట్ లో ఎలాగైనా ఈ సినిమాను హిందీలో రీమేక్ చెయ్యాలంటూ కొనియాడారు. అయితే అసలు ఈ అనుల్ సెక్షీనా ఎవరని ఆలోచిస్తున్నారా ఇతను నార్త్ ఇండియాలో ఒకానొక ఫేమస్ ఎథికల్ హేకర్ పఠాన్ కోట్ ఉగ్ర దాడిలో జవాన్లు వీర మరణం పొందడంతో ఉద్వేగానికి లోనైన అతను పాకిస్థాన్ గవర్నమెంట్ కి చెందిన వెబ్ సైట్ లను స్థంభింపచేసి ఆ వెబ్సైట్ లలో భారత జాతీయ జెండాను రెప రెప లాడించాడు. ప్రస్తుతం అనుల్ సెక్షీనా బాలయ్య అఖండ సినిమా గురించి, బాలయ్య అఘోర కేరెక్టర్ పోస్టర్ అద్భుతంగా వుందటూ పోస్ట్ పెట్టడంతో బాలీవుడ్ చూపు మొత్తం అఖండ సినిమాపై పడింది.

అయితే అఖండ సినిమాను హిందీలో బాలివుడ్ హీరో అక్షయ్ కుమార్ చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. అయితే దీనిపై ఎలాంటి అదికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా బాలయ్య ఫ్యాన్స్ మాత్రం అఖండ సినిమాను యాజిటీజ్ ఇలాగే హిందీలోకి డబ్ చెయ్యాలంటూ కోరుతున్నారు. ఏదేమైనా ఒక్క సినిమాతో ఇప్పటి వరకూ తనను విమర్శించిన వారికి బాలయ్య అఖండ సినిమాతో ఇప్పటికే ఫుల్ క్లారిటీ వచ్చేసి ఉంటుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular