May 26, 2020

కాశ్మీర్ మాదే మాతోనే ఉంటుంది.. శిఖర్ ధావన్ పాకిస్థాన్ కి సవాల్

afridi comments on modi

afridi comments on modi

పాకిస్థాన్ లో ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండడంతో క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ POK ( పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ) లో తన ఫౌండేషన్ ద్వారా విరాళాలు సేకరించి ఆ డబ్బుతో అక్కడి ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు. తరువాత పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆఫ్రిదీ కాశ్మీర్ లో ప్రదాని మోడీ ప్రజల పై అరాచకాలు చెస్తున్నారన్నారు. వీటికి మోడీ బదులివ్వాలన్నారు. కరోనా కంటే మోడీ మనసులో పెద్ద జబ్బు ఉందని తన వక్రబుద్దిని బయటపెట్టుకున్నాడు.   తన  వ్యాఖ్యలపై  స్పందిచిన బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్, గౌతం గంభీర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మీ దేశంలో భారత్, మోడీ పై విషం చిమ్మే బఫూన్లు చాలా మందే ఉన్నారన్నారు. ప్రస్తుతం ఆ వరుసలో నువ్వు కూడా చేరావని వ్యాఖ్యానించారు. మీ దేశాన్ని ఉద్ధరించి ఏడవలెని వారు కాశ్మీర్, భారత్ పై మాట్లాడటం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. 20 కోట్ల మంది జనాభా ఉన్న పాకిస్థాన్ ఏడు లక్షల సైన్యంతో 20సంవత్సరాలుగా బిక్షమెత్తుకుంటుందని అన్నారు. బంగ్లాదేశ్ విబజన ఇంకా మర్చిపోలేదా అని ప్రశ్నించారు.

అయితే గంబీర్ మాత్రమే కాకుండా టీంఇండియా ఓపెనర్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ సైతం ఆఫ్రిదీ పై విరుచుకు పడ్డారు. ప్రపంచం లో అన్ని దేశాలూ కరోనాతో ఇబ్బందులు పడుతుంటే మీరు మాత్రం కాశ్మీర్ పైనే  పడి ఎదుస్తున్నారని అన్నారు. మీ దేశం మొత్తం వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరన్నారు. మా దేశం లో ఒక్కొక్కరూ లక్ష మందితో సమానం అంటూ కాశ్మీర్ మాదే ఎప్పటికీ మాతోనే ఉంటుందంటూ సమాదానమిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *