గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeసినిమాఆదిపురుష్ లో హనుమంతుని కేరెక్టర్ మంచు మనోజ్ నటిస్తున్నాడా...?

ఆదిపురుష్ లో హనుమంతుని కేరెక్టర్ మంచు మనోజ్ నటిస్తున్నాడా…?

ప్రభాస్ తాజాగా ఎనౌన్స్ చేసిన చిత్రం “ఆదిపురుష్” ఈ సినిమా నటీనటుల సెలక్షన్లో చిత్ర దర్శకుడు ఓం రౌత్ చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే రాముని పాత్రలో ప్రభాస్ చేస్తుండగా సీతాదేవి పాత్ర కోసం కైరా అద్వాని, అనుష్క శర్మ లలో ఒకరిని తీసుకునే అవకాసం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రామాయణంలో అతి కీలకమైన పాత్ర హనుమంతుని పాత్ర.

ఒక వైపు దర్శకుడు ఈ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా అని చూస్తుండగా సోషల్ మీడియా వేదికగా నేడు హనుమంతుని పాత్ర పై కొత్త చర్చ మొదలైంది. ఈ పాత్రలో మంచు మనోజ్ కరెక్టుగా సరిపోతాడనే వాదన ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు. హనుమంతుని ఆకారంలో మంచు మనోజ్ బాగా సూటవుతాడని సోషల్ మీడియాలో అబిప్రాయపడుతున్నారు.

మరి దర్శకుడు మంచు మనోజ్ కి ఈ అవకాశం ఇస్తాడో లేదో చూడాలి. చాలా రోజులుగా ఒక మంచి హిట్టు కోసం ఎదురు చూస్తున్న మనోజ్ కి ఈ కేరెక్టర్ దొరికితే జీవితంలో నిలిచిపోయే పాత్ర అవుతుందనడంలో సందేహంలేదు. అయితే మంచు మనోజ్ రీసెంట్ గా చేస్తున్న చిత్రం “అహం భ్రహ్మాస్మి”  కూడా ఆధ్యాత్మిక చిత్రం కావడం విశేషం. అంతేకాక ఎప్పటినుంచో ప్రభాస్ మరియు మంచు మనోజ్ కుటుభం మద్య మంచి రిలేషన్ కూడా ఉంది.

ఆదిపురుష్ లోని విశ్వామిత్రుని పాత్రలో మోహన్ బాబు లేదా కృష్ణం రాజు లలో ఒకరు నటిస్తారనే వార్త వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఒకే కుటుంభ నుండి రామాయణంలో రెండు ప్రదాన పాత్రలు చేసినవారవుతారు.  ఇక సినిమాని ఎక్కువశాతం ఇండోర్ షూటింగ్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి ఔట్ డోర్ షూటింగ్ లో భాగంగా కేరళ, శ్రీలంక లలోని భారీ అడవులలో షూటింగ్ చేస్తారని తెలుస్తోంది.

మరికొన్ని అడవులను  గ్రాఫిక్స్ రూపంలో తెరపైకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క గ్రాఫిక్స్ కే సుమారు 150 నుండి 200 కోట్లు ఖర్చు చేస్తునట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా గ్రాఫిక్స్ నిమిత్తం హాలివుడ్ లో అవతార్, స్టార్ వార్స్   వంటి సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించినవారే ఈ సినిమాలో కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.           

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular