మంగళవారం, జూన్ 18, 2024
Homeసినిమాసోనూసూద్… విమానాల్లో కార్మికులను తరళిస్తున్నాడు..

సోనూసూద్… విమానాల్లో కార్మికులను తరళిస్తున్నాడు..

వలస కూలీల పాలిట దేవుడెవరయ్యా అని అంటే ప్రస్తుతం ఈ సమయంలో ఎవరు అన్నం పెడితే వాళ్ళే దేవుళ్లు. ఎందుకంటే నేడు ఆ ఆకలి కడుపులకు అన్నం పెట్టిన వాళ్లే దేవుడు అలాంటి వారందరికీ బాలివుడ్ యాక్టర్ సోనూసూద్ గత కొద్దిరోజులుగా అన్నదానం చేస్తున్నాడు. అంతేకాక కొన్ని వందల కిలోమీటర్లు రోడ్లపై  నడుస్తున్న చాలామంది బాధను చూడలేక

వాళ్లందరినీ ఒక్క చోటుకు చేర్చి వారికి తిండి పెట్టి ప్రత్యేక బస్సుల్లో వాళ్లను వాళ్ల సొంతూళ్లకు చేర్చి వాళ్ల పాలిట రియల్ హీరోగా సోనూసూద్ మారాడు. ఇక ముంబైలో తనకున్న ఆరంతస్తుల సొంతహోటల్ ను సైతం డాక్టర్లకు, నర్సులకు, పారామెడికల్ సిబ్బందికి వారు ఉండేందుకు ఉచిత సదుపాయాలు కల్పిస్తూ అక్కడ కూడా  తన సేవాబావాన్ని చాటుకున్నారు సోనూ సూద్.

అయితే ఇప్పుడ తను మరో అడుగు ముందుకేసి కేరళలో ఉన్న ఎర్నాకుళం సమీపంలో ఓ నేత నేసె  కంపెనీలో పనిచేస్తున్న సుమారు 177 మంది మహిళలు వారు  తమ సొంత రాష్ట్రమైన ఒడిశాకు తాము వెళ్లాలంటూ సోనూసూద్‌ను సాయం చెయ్యాలని కోరారు.

ఈ విషయం తెలిసిన వెంటనే ఆ మహిళల  కోసం ఓ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాడు. మీ గురించి నాకు తెలిసిన వారి ద్వారా మహిళలు చిక్కుకుపోయిన విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. అందుకే నేను వారికి సాయం చేయగలనని నాకు అర్థమైంది. అందుకు నా దగ్గర ఉన్న ఏకైక మార్గం ఏంటంటే ఆ మహిళలను విమానంలో తరలించడం.’ అని సోనూసూద్ సీఎన్ఎన్ న్యూస్ 18కి తెలిపాడు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular