మంగళవారం, మార్చి 19, 2024
Homeజాతీయంకరోనా నుండి రక్షించే Aarogya Setu యాప్.. 5 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్

కరోనా నుండి రక్షించే Aarogya Setu యాప్.. 5 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్

కరోనా  ప్రభావాన్ని నిర్మూలించడానికి కేంద్ర ఆరోగ్య శాఖ తీసుకువచ్చిన “Aarogya Setu” యాప్ ఇప్పుడు కరోనా లక్షణాలున్న వారికి ఈ యాప్  ఎంతగానో సాయపడుతుంది. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ ప్లేస్టోర్ లోనూ మరియు ఐఓఎస్ స్టోర్ లోనూ లభ్యమవుతుంది. ఈ అప్లికేషన్ ద్వారా కరోనా  బారినపడిన వారు తమ దగ్గరకు ఆరు అడుగుల  దూరం రాగానే తమను ఎలర్ట్ చేస్తుంది.

అయితే ఈ యాప్ ప్రతి ఒక్కరూ తమ డివైస్ లో ఇన్స్టాల్ చేసుకుని మొబైల్ ఇంటర్నెట్ మరియు జీపిఆర్ఎస్ లను ఆన్ చేసి ఉంచినప్పుడు మాత్రమే Aarogya Setu Mobile App ద్వారా సరైన సేవలను పొందగలుగుతాము. ఒక్కసారి ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసిన తర్వాత తమ యొక్క భాషను ఉంచుకుని నెక్స్ట్ పై క్లిక్ చేయగానే  కరోనా గురించిన సమాచారం అందించబడుతుంది. 

తరువాత  మీ మొబైల్ లో  జీపీఆర్ఎస్ ఆన్ చేయమని నోటిఫికేషన్ వస్తుంది జిపిఆర్ఎస్ ఆన్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ అవ్వమని ఒక బటన్ కనిపిస్తుంది ఆ బటన్ పై క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని వస్తుంది.

మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ కు వచ్చిన ఓటిపి ఎంటర్  చేయాలి తదుపరి మీ వ్యక్తిగత వివరాలను పొందుపరచాలి అనగా పేరు వయసు వృత్తి మొదలగు డేటాను ఎంటర్ చేయాలి.  మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి అక్కడ తెలియజేయాలి అనగా  రొంప, జ్వరం,  దగ్గు వంటి వివరాలను అక్కడ ఇవ్వాలి ఒకవేళ ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ అప్ ద్వారా మీ సమస్యను ఎప్పటికప్పుడు పర్యవేక్షించ బడుతుంది. తద్వారా కరోనా వ్యాప్తి జరగకుండా ఉంటుంది.

ఈ యాప్ లో ఆంధ్ర ప్రదేశ్ కరోనా  నివారణకు సంబంధించిన helpline numbers కూడా పొందుపరిచారు. ప్రస్తుతం ప్లే స్టోర్ లో ఈ యాప్ సంచలనం సృష్టిస్తుంది ఈ యాప్ ను  రెండు వారాల్లోనే 50 మిలియన్ లకు పైగా ఇన్స్టాల్ చేశారు.  ఈ యాప్ తక్కువ సమయంలో ఎక్కువ మంది ఇన్స్టాల్ చేసిన యాప్ గా రికార్డుకెక్కింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular