శుక్రవారం, జూలై 26, 2024
Homeరాజకీయంఅమరావతి సమరానికి 600రోజులు ...మళ్ళీ ఉవ్వేత్తున ఎగసిన ఉద్యమం

అమరావతి సమరానికి 600రోజులు …మళ్ళీ ఉవ్వేత్తున ఎగసిన ఉద్యమం

ఆంద్రుల ఏకైక రాజధాని అమరావతి ఉద్యమానికి నేటితో 600 రోజులు పూర్తి కావొచ్చింది. రాజధాని గ్రామాల రైతులు ఈరోజు ఈ ఉద్యమం లో కుర్చున్నారో గాని నాటి నుండి నేటి వరకూ వారిపై పాలకుల దౌర్జన్యానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. 600 రోజులుగా ఎండకు ఎండారు, వానకు తడిచారు పోలీసుల బూట్ల క్రింద నలిగారు. ఇంటిని వదిలి టెంటు వేసుకుని పడరాని కష్టాలూ పడ్డారు చివరికి అక్రమ కేసుల్లో రైతులను బేడీలూ సంకెళ్ళూ వేసి జైలుకి తరలించినా కష్టాల్ని, బాదల్ని భరించి రాబోయో రోజుల్లో ఎలాగైనా మంచి జరుగుతుందనే ఆశతో బ్రతుకుతున్న రైతుల ఉద్యమం  600 రోజులు కావడంతో మళ్ళీ అదే స్థాయిలో ఉవ్వెత్తున ఎగసిపడుతుంది.

నేడు రాజధాని ప్రాంత గ్రామాలలో ఉదయాన్నే భారీగా పోలీసులు మొహరించాడంపై రాజధాని రైతులు మండి పడుతున్నారు. రైతులు గ్రామాలనుండి బయటకు వెళ్ళకుండా నిరోధించారు పోలీసులు అంతే కాకుండా రాజధాని ఉద్యమం పై కవరేజ్ చేయడానికి వెళ్తున్న కొన్ని మీడియా చానళ్ళను అడ్డగించి వారిని వెళ్ళడానికి మీడియాకి అనుమతి లేదంటూ ఇక్కడ కెమెరా ఆన్ చేయకూడదంటూ పోలీసులు వారికి కొత్త రూల్స్ పెట్టారు.

ఇక అమరావతి ఉద్యమంలో ప్రధానంగా మహిళల పాత్ర వెలకట్టలేనిది. నేడు మందడం తో పాటు పలు గ్రామాల మహిళలను కాళ్ళూ చేతులూ పట్టుకుని ఈడ్చుకు వెళ్లడంపై మహిళలు మండిపడుతున్నారు. ఇక 3 రాజదానులకు మద్దతు తెలిపిన వారిని పోలీసులే వాహనంలో వదులుతున్నారంటూ పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.

చివరికి గుడికి వెళ్ళే రైతులను కూడా గుడికి వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇక అమరావతి ఉద్యమానికి 600 రోజులు కావడంతో వారికి మద్దతు తెలపడానికి ఆగ్రామాలకు వస్తున్నవారిని పోలీసులు అడ్డుకున్నారు. ఒక కవి చెప్పినట్లు “పోరాడితే పోయేదేముంది భానిస సంకెళ్ళు తప్ప”  ఏదేమైనా ఎప్పటికైనా అమరావతే మన రాజధానిగా ఉండాలని కోరుకుంధాం.

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular