శుక్రవారం, జూలై 26, 2024
Homeటెక్నాలజీ241543903 ఈ నెంబర్ కి గూగుల్ లో అంత ప్రత్యేకత ఎందుకో తెలుసా

241543903 ఈ నెంబర్ కి గూగుల్ లో అంత ప్రత్యేకత ఎందుకో తెలుసా

241543903 ఈ వింత ఇంటర్నెట్ ప్రపంచంలో రోజూ ఏది జరిగినా అదో కొత్త వింతే ఇంటర్నెట్, ఫోన్ లేని ఇళ్ళు దాదాపు లేవనే చెప్పాలి ప్రతీ అవసరానికీ ముందుగా గుర్తొచ్చేది ఫోనే. చివరికి పట్టుమని పది ఫోన్ నెంబర్లు కూడా గుర్తుపెట్టుకోలేనంతగా బ్రెయిన్ కి పనిచేప్పలేని స్థాయికి వెళ్ళిపోయాం ఇదేకాక ఇంటర్నెట్ వాడకంలోనూ ప్రపంచంలో ముందు వరుసలోనే ఉన్నాం.

ఇంటర్నెట్ తో పాటు వీటికి తోడు రోజుకొకటి కొత్తగా పుట్టుకొచ్చే సోషల్ మీడియా యాప్ లు కోకొల్లలు. వీటి వాడకంతోనే రోజు మొదలవుతుంది రోజు ముగుస్తుంది. వీటితో పాటు ప్రపంచ ప్రఖ్యాత సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ దీని గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ప్రపంచంలోని డేటా మొత్తం ఈ గూగుల్ లో నిక్షిప్తం అయ్యి ఉంటుంది. ఇక మిగిలిన సెర్చ్ ఇంజెన్ అయిన యాహూ, బింగ్ వంటి అనేక సర్చ్ ఇంజెన్ దిగ్గజ కంపెనీలు ఉన్నా గూగుల్ కి ఉన్న Accurate Information వంటివి వాటిలో తక్కువనే చెప్పాలి.

241543903 అని గూగుల్ లో టైప్ చెయ్యగానే 

గూగుల్ ఇన్ఫర్మేషన్ బెసేస్ పైనే చాలా పనులు ముందుకు సాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇక పూర్తి వివరాలలోకి వెళితే సాదారణంగా ఎవరైనా వారి గూగుల్ జీమెయిల్ ఎకౌంటు తో లాగ్ ఇన్ అయి వారి గూగుల్ ఎకౌంటు లో ఉండే గూగుల్ డ్రైవ్ లో చాలా మంది వారు తీసుకున్న ఫోటోలు, వీడియోలను ఆ గూగుల్ డ్రైవ్ లోకి అప్లోడ్ ఎలాగైతే చేస్తుంటారో అలాగే చాలా ఏళ్ల క్రితం డేవిడ్ హార్విట్జ్ అనే ఒక వ్యక్తి తన గూగుల్ డ్రైవ్ లో ప్రతీరోజూ కొన్ని ఫోటోలను తీసి వాటిని అప్లోడ్ చేసేవాడు అందరిలా కాకుండా ఇలా ప్రతీరోజూ డిఫరెంట్ గా ఏదో ఒక పోటో పెడుతూనే ఉండేవాడు అయితే తన ఫోటోలకు ఇంప్రెస్స్ అయ్యి కొద్ది రోజుల్లోనే తనను ఫాలోవర్లు కూడా భారీగా వచ్చారు.

Head In Freezer అంటే ఏమిటో తెలుసా

అసలు Head In Freezer అనే కాన్సెప్ట్ మొదటగా 2009 ఏప్రిల్ లో డేవిడ్ హార్విట్జ్ అనే ఒక కళాకారుడు తనకు ఫోటో గ్రఫీ పై ఎంతో మక్కువ తను రోజూ ఎన్నో అందమైన ఫోటోలు తీస్తూ వాటిని తన తంబ్లర్ అనే సోషల్ మీడియా యాప్ లో పోస్ట్ చేస్తూ ఉండే వాడు.

241543903 ఈ నెంబర్ కి అంత ప్రాముఖ్యత ఏమిటో తెలుసా ?

 ఇంకా కొత్తగా ఏదో చెయ్యాలని డేవిడ్ హార్విట్జ్ ఒకరోజు తన తలను ఫ్రిడ్జ్ లో పెట్టి ఫోటో తీసి దానిని తన 241543903 అనే నెంబర్ తో ఆ ఫోటోని రినేమ్ చేసి దానిని డేవిడ్ హార్విట్జ్ తన ఎకౌంట్ లో అప్ లోడ్ చెయ్యగా మొదటగా ఇదేదో వింతగా ఉందంటూ చాలా మంది ఆ ఫోటోను ఓపెన్ చేసి చూడడం మొదలు పెట్టారు దీనితో అది కాస్త గూగల్ ఫొటోస్ లో ట్రెండ్ అయ్యింది. దీనితో డేవిడ్ హార్విట్జ్ ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ విదంగానే ప్రిడ్జ్ లో వారి తల పెట్టి ఫోటోలు దిగి 241543903 నెంబర్ తో అప్లోడ్ చేయడంతో అప్పట్లో అదొక ట్రెండ్ గా మారింది. అయితే అప్పటి ట్రెండ్ గూగుల్ లో 241543903 నెంబర్ కొట్టి సెర్చ్ చెయ్యగానే ఇప్పటికీ అవే ఫోటోలు వస్తుంటాయి.

Head In Freezer కాన్సెప్ట్ ఎలా మొదలయ్యింది

ఒకరోజు డేవిడ్ హార్విట్జ్ తన స్నేహితుడు ఒకరికి విపరీతమైన తలపోటు వస్తుండడంతో ఈ తలపోటు తగ్గడానికి ఏదైనా ఉపాయం ఉంటచెప్పమని తన స్నేహితుడు అడుగగా డేవిడ్ హార్విట్జ్ దీనికి ఒకటే మార్గం వెళ్లి నీ తల కొంత సేపు ప్రిడ్జ్ లో పెట్టు కొంతసేపటికి నీ తలపోటు తగ్గిపోతుందని చెబుతాడు వెంటనే తన ఫ్రెండ్ వెళ్లి తన తలను ప్రిడ్జ్ లో పెట్టగా దీనిని డేవిడ్ హార్విట్జ్ ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చెయ్యడంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోతాడు. అయితే తాను ఫోటో తీయానికే తన ఫ్రెండ్ తలను ఫ్రిడ్జ్ లో పెట్టమన్నాడా అనే డౌట్ రాక మానదు.            

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular