మంగళవారం, మార్చి 19, 2024
Homeజాతీయంపుట్‌పాత్ స్టేజ్ నుండి DRDO లో శాస్త్రవేత్తగా ఎదిగిన కుర్రాడు

పుట్‌పాత్ స్టేజ్ నుండి DRDO లో శాస్త్రవేత్తగా ఎదిగిన కుర్రాడు

మీరు ఫోటో లో చూస్తున్న ఇతని పేరు” ప్రతాప్” కర్ణాటక మైసూర్కి  దగ్గరలోని కాడేకొడి గ్రామంలో నివసిస్తుంటాడు. ఇతనిది దిగువ మధ్ఇయతరగతి కుటుంభం ఇతని తండ్రి  వ్యవసాయం చేస్తూ నెలకు 3,000 రూపాయలు మాత్రమే సంపాదించగల కుటుంబం నుంచి వచ్చిన ప్రతాప్ 21 సంవత్సరాల వయస్సులోనే మనదేశ ప్రధానమంత్రి స్వయంగా “DRDO” లో నియమించారు.

ప్రతాప్ తాను సాధించిన ఈ విజయం  అంత తేలిగ్గా రాలేదు ఎన్నో ఒడిదుడుకులు మరెన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాడు. అతనికి చిన్ననాటి నుంచి ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టం దానిని ప్రేరణగా తీసుకుని  ప్రతాప్ డ్రోన్ తయారు చేద్దాం అనుకున్నాడు.

దానికి సంబంధించిన విధి విధానాలు మరియు సాంకేతిక టెక్నాలజీ మరియు హార్డ్వేర్ పరికరాల గురించి ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని సేకరించుకొనేవాడు ప్రతాప్ “బిఎస్సి ఫిజిక్స్” వరకు చదువుకున్నాడు.

ప్రతాప్ కాలేజీలో చదువుతున్న  సమయంలో హాస్టల్ ఫీజు చెల్లించలేదని తనను బయటకు పంపేశారు దీనితో తను బస్టాప్ లో ఉండి పబ్లిక్ టాయిలెట్ లో పనిచేస్తూ మిత్రులు ఇచ్చిన ధన సహాయంతో c++, java వంటి సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ కోర్సులు నేర్చుకుని స్నేహితుల వద్ద నుండి మరియు ఆఫీసునుండి e-waste సేకరించి కంప్యూటర్ పరికరాలపై తన ప్రయోగాలను చేస్తూ ఉండేవాడు.

పగటిపూట కాలేజీలోనూ మరియు కొన్ని చోట్ల పని చేస్తూ రాత్రిపూట వీటిపై పరిశోధన చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా చేస్తూ 80 ప్రయత్నాల తర్వాత ఒక డ్రోన్ తయారు చేశాడు. మొదటిసారి ఆ డ్రోన్ గాల్లోకి వెళ్ళగానే అతడు అంతులేని ఆనందంలో మునిగి తేలాడు. అతను చేసిన డ్రోన్ చూసిన స్నేహితులు అతను ఒక హీరోగా చూసేవారు.

ఇంతలో ఢిల్లీలో జరిగే డ్రోన్ కాంపిటేషన్ గురించి తెలుసుకుని అక్కడ తాను తయారు చేసిన డ్రోన్ తీసుకు వెళ్ళాలి అనుకుని తాను కూలిపని చేసుకునే డబ్బులతో జనరల్ కంపార్ట్మెంట్లో ఢిల్లీకి పయనమయ్యాడు.

అక్కడ అతనికి సెకండ్ ప్రైస్ రావడం అంతేకాక జపాన్ లో జరిగే ప్రపంచ డ్రోన్ క్యాపిటేషన్ పోటీలకి వెళ్లడానికి అనుమతి లబించింది. జపాన్ వెళ్లడం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం అంతేకాదు తాను చేసిన ప్రాజెక్ట్ మన దేశంలోని ప్రొఫెసర్ చేత ముందుగా ఆమోదముద్ర వేయించుకోవాలి.

అయితే ఎంతో కష్టపడి మద్రాస్ చేరుకున్న ప్రతాప్ అక్కడ ప్రొఫెసర్ చేత ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేయించుకున్నాడు అక్కడి నుండి అతని సర్టిఫికెట్స్ తాకట్టు లో పెట్టి చివరికి తల్లి మంగళసూత్రాన్ని తాకట్టులో పెట్టి కొంతమంది దాతలు ఇచ్చిన సహాయంతో జపాన్ కు వెళ్ళాడు అక్కడ ఎంతో కష్టపడి తన డ్రోన్లు ప్రదర్శించాడు.

చివరికి విజేతలను ఒక్కొక్కరుగా ప్రకటిస్తున్నా ఎంత వేచి చూసినా ప్రతాప్ పేరు వినపడకపోవడంతో  నిరాశతో అతడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న తరుణంలో ఇంతలో మూడవ స్థానాన్ని ఫ్రాన్స్, రెండవ స్థానంలో అమెరికా నిలబడతాయి.

ఇక చిట్టచివరి మొదటి స్థానంలో నిలబడిన వ్యక్తి పేరు పిలుస్తారు ప్రతాప్ ఫ్రం ఇండియా అని పిలవగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ పోడియం వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుండి ఎన్నో ప్రదర్శనలు చేస్తూ ఉన్నతమైన ఉద్యోగాల ఆఫర్ వస్తున్నా వాటిని  తిరస్కరించాడు.

మన దేశానికి సేవ చేయాలనే ఒక ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి పిలవగానే DRDO లో పనిచేయటానికి ఆమోదించారు. 21 ఏళ్ల ప్రతాప్ మరెన్నో విజయాలను మన దేశానికి అందివ్వాలని కోరుకుంటూ మన ప్రజావారధి తరపున ప్రతాప్ కు శుభాకాంక్షలు జై హింద్.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular