శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeజాతీయంవీళ్ళు 12 నెలల వరకూ రుణాలు కట్టక్కర్లేదు..

వీళ్ళు 12 నెలల వరకూ రుణాలు కట్టక్కర్లేదు..

ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ (Atmanirbhar bharat abhiyan) కింద ఇచ్చే కేటాయింపుల వివరాలగురించి కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ లో వివరించారు. ఎమ్.ఎస్.ఎమ్.ఈ లకు 12 నెలల మారిటోరియంతో రుణాలు ఇస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తేలిపారు.

ఎమ్.ఎస్.ఎమ్.ఈ లకు సంబంధించి మూడులక్షల కోట్లు కేటాయిస్తున్నామని ఎటువంటి పూచికత్తు లేకుండా 12 నెలల వరకూ తీసుకున్న ఈ రుణాలపై ఎటువంటి తిరిగి చెల్లింపులు లేకుండా మారిటోరియంతో ఋణం ఇస్తామన్నారు కేంద్రమంత్రి.

ఎమ్.ఎస్.ఎమ్.ఈ లకు ఈ ప్యాకేజ్ వల్ల అందుతున్న రుణాలతో ఆరు అంశాల్లో ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఎమ్.ఎస్.ఎమ్.ఈ తక్షణ ఉత్పత్తులు ప్రారంభించేందుకు, ఉద్యోగులకు భద్రత కల్పించేందుకు ఈ ప్యాకేజ్ ఉపయోగపడుతుందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు.

ఇక ఆత్మనిర్భర్ అభియాన్ వివరాలు ఈ రోజు నుంచి ఒక్కొక్కటిగా తెలుపుతామని అన్నారు. ఈ ఆర్ధిక ప్యాకేజ్ లో 15 అంశాలలో కేటాయింపులు ఉంటాయని తెలిపారు. తీవ్రమైన ఒత్తిళ్లలో ఉన్న ఎమ్.ఎస్.ఎమ్.ఈ లకు 20 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు నిత్మలాసీతారామన్ తెలిపారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular