శనివారం, జూలై 27, 2024
Homeజాతీయం10వ తరగతి పరీక్షలు ఇక అప్పుడేనట...

10వ తరగతి పరీక్షలు ఇక అప్పుడేనట…

లాక్ డౌన్ కారణంగా ఇంకా ఎక్కడా కూడా ఆఫీస్ లు పూర్తిగా తెరుచుకున్న పరిస్థితి లేదు. ఇక పరీక్షల విషయానికొస్తే ఎక్కడివక్కడే అన్నట్టు నిలిచిపోయాయి. కొన్ని ఎగ్జామ్స్ జరిగినప్పటికీ వాటి ఫలితాలు మాత్రం ఇంకా వెలువడలేదు. ​ఈ నేపథ్యంలోనే  లాక్ డౌన్​కు ముందు నిర్వహించిన సీబీఎస్​ఈ ఎగ్జామ్ పేప‌ర్స్ మూల్యాంకనానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్.

ఇక 10, 12వ తరగతులకు ఇప్పటికే నిర్వహించిన ఎగ్జామ్ కి సంబంధించిన పేప‌ర్స్ 3 వేల స్కూల్స్ నుంచి టీచ‌ర్స్ కు అందాయి. ఇక వీటికోసం ఆదివారం నుంచి పేపర్ల వేల్యూషణ్  ‌ప్రారంభించనున్నారు. అయితే లాక్ డౌన్ వల్ల అందరూ ఒకచోటుకు చేరే అవకాశం లేనందున ఉపాధ్యాయులు వాళ్ళ  ఇంటివద్ద నుంచే ఎగ్జామ్ పేప‌ర్స్ మూల్యాంకనం చేస్తారు. ఇక ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి దాదాపు  50 రోజులు సమయం పడుతుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు.

కరోనా వైరస్​ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా  ఎక్కడికక్కడ విధించిన ఆంక్షలవల్ల విద్యాశాఖకు కూడా లాక్​డౌన్​ సెగ తగిలింది. కట్టుదిట్టమైన లాక్ డౌన్ అమ‌లవుతోన్న‌ నేపథ్యంలో పరీక్షా పత్రాల మూల్యాంకనంలో ఆలస్యం జరిగింది. అయితే సీబీఎస్ఈ 10, 12 తరగతులకు లాక్‌డౌన్‌కు ముందే కొన్ని పరీక్షలను నిర్వహించారు అధికారులు. మిగిలిన ఎగ్జామ్స్ జరిగాల్సి ఉండగా వాటిని లాక్​డౌన్​ కారణంగా వాయిదా వేశారు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన తర్వాత వీటిని జులై 1 నుంచి 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular