లాక్డౌన్ కఠినం అయింది ఉల్లంగిస్తే ఇక ఇంతే

0
136
lockdown in telangana
lockdown in telangana

కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుంతుండటం, ఢిల్లీ ప్రార్ధనల ఎఫెక్ట్ తో కేసుల సంఖ్య పెరగడంతో పోలీసులు మరింత కట్టుదిట్టంగా కర్ఫ్యూ అమలుకు సిద్ధమయ్యారు. లాక్డౌన్ ని ఉల్లఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఎవరు కాలుబయట పెట్టినా వారిపై కేసులు నమోదు చేసి కటకటాలకు పంపిస్తున్నారు. దీనితోపాటు వారి బళ్లను కూడా సీజ్ చేసి స్టేషన్ కు తరలిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.

ఇప్పటికే 1790 మందిని అరెస్ట్ చేశారు.  అరెస్ట్ చేసిన వారిలో టూ వీలర్ వాహనదారులు ఎక్కువ. ఇక గత వారం రోజుల నుంచి మూడువేలకు పైగా ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇక కేసుల వివరాల్లోకి వెళితే లాక్డౌన్ కేసులు 359 , వాహనాలపై చట్టప్రకారం జరిమానా రూ. 74,51,326, 1572 ఎఫ్ఐఆర్ లు, సీజ్ చేసిన బళ్ళు 16350 ఇప్పటికైనా లాక్ డౌన్ ను పట్టించుకోకుండా వ్యవహరిస్తే మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని తెలంగాణ పోలీసులు తెలిపారు.