గురువారం, ఫిబ్రవరి 29, 2024
HomeసినిమాRRR షూటింగ్ ప్రారంబించిన రాజమౌళి

RRR షూటింగ్ ప్రారంబించిన రాజమౌళి

టాలివుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మిన్స్తున్న మల్టీ స్టార్ చిత్రం RRR (రాజమౌళి – రామారావు – రామ్ చరణ్ ) ఇది అఫీషియల్ గా నవంబర్ 11 న స్టార్ట్ అయినప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కొంత సేపటి క్రితమే ప్రారంభం అయినట్లు TWITTER ద్వారా రాజమౌళి ట్వీట్ చేసారు. వీరి కాంబినేషన్ లో మూవీకోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

షూటింగ్ విశేషాలు

మామూలుగా తమ అభిమాన నటుడు ఉన్న మూవీకోసం ఎంతో తాపత్రయ పడే అబిమానులు టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న ఈ ముగ్గురినీ ఒకే స్క్రీన్ పై చూడాలంటే రెడుకల్లూ చాలవనే చెప్పాలి. RRR కథ విషయానికి వస్తే ఎన్టీఆర్, రామ్ చరణ్ ల స్థాయిని ఒక్కసారిగా పెంచే కథ తయారుచేసి ఉంటాడనే తెలుస్తుంది.

వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్న వీరిపై టాలివుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. షూటింగ్ విషయానికొస్తే బ్రిడ్జి పై ఫైట్ షూట్ చేస్తుంటే ఒక పాత భవంతిలో సినిమాకు సబంధించి కొన్ని సన్నివేషాలు చిత్రీకరిస్తున్నారు.

ఎన్టీఆర్ బంది పోటుగా, చరణ్ పోలీసు అధికారిగా..

ఈ షూటింగ్ కి సంబంధించి ఈ ముగ్గురూ ఒక ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు అది ఇప్పుడు వైరల్ అయ్యింది. మూవీ షెడ్యూల్ రెండువారాల వరకూ సాగుతుందని టాక్. దీనిని వచ్చే దీపావళికి షూటింగ్ మొత్తం పూర్తిచేసి ఆ తరువాత గ్రాఫిక్స్ మరియు ఇతర పనులను పూర్తి చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు చెభుతున్నారు.

అయితే ఈసినిమాను దానయ్య నిర్మిస్తున్నారు. బడ్జెట్ మూడు వందల కోట్లు వరకూ ఉండవచ్చని తెలుస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ బందిపోటుగా చరణ్ పోలీసు అధికారిగా కనిపిస్తారని ప్రచారంలో ఉంది.

సంవత్సరాల పాటు  తన చిత్రాన్ని శిల్పంలా చెక్కే రాజమౌళి ఈ చిత్రాన్ని అనుకున్న టైంకే తీసుకోచ్చినప్పటికే రీలీజ్ కూడా అనుకున్న టైంకే ప్రేక్షకుల వద్దకు వస్తుందో లేదో చూడాలి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బలమైన దేహదారుద్యంతో కనిపించబోతుంటే రామ్ చరణ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నారు.

ఇది స్వాతంత్ర్యం రాకముందు కథగా తెలుస్తుంది. ఈ నెల 11 న జరిగిన చిత్ర ప్రారంబోత్సవంలో కూడా ఎన్టీఆర్ అదే గెటప్లో పదునైన మీసకట్టుతో కనిపించారు.

మూవీ కేస్టింగ్

ఇక ఈ చిత్రం కోసం ముగ్గురు హీరోఇన్లను ఎంపిక చేసేపనిలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తుంది. దివంగత నటి శ్రీదేవి కూతురు జాహ్నవి ని ఈ చట్రానికి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాకు టెక్నీషియన్ల విషయానికి వస్తే బాహుబలి సినిమాకు పనిచేసిన వారే దీనికి పనిచేస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాకు కథ విజయేంద్ర ప్రసాద్ అందిస్తుండగా.. సంగీతం ఎంఎం కీరవాణి, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, దీవోపీ కేకే సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ గా సాబు సిరిల్, కాస్ట్ట్యుమ్ డిజైనర్ గా రమా రాజమౌళి, డైలాగ్స్ బుర్రా సాయి మాధవ అందిస్తున్నారు. ఈ సినిమా 2020 మే నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular