బ్రేకింగ్ న్యూస్ సల్మాన్ ఖాన్ మేనల్లుడు మృతి

0
347
salman khan nephew death
salman khan nephew death

సల్మాన్ కంటతడిపెట్టుకున్నాడు తనమేనల్లుడి మరణవార్త విని తట్టుకోలేకపోయాడు. తన  ట్విట్టర్‌ ఖాతాలో మేనల్లుడు ఫోటో పెట్టి మరణ వార్తను పోస్ట్  చేసాడు  సల్మాన్. 38 ఏళ్ల అబ్దుల్లా ఖాన్ మరణం సల్మాన్ ఇంట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

అబ్దుల్లాతో సల్మాన్ కి తీరని అనుబంధం ఉంది.  గత కొంతకాలంగా ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ ఉండడంతో అనారోగ్యంతో బాధ పడుతున్న అబ్దుల్లా సోమవారం రాత్రి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన  సల్మాన్, “ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము” అంటూ ఈ  విషయాన్ని అభిమానులకు చేరవేశారు.

తనమరణ వార్తతో సల్మాన్ కుంగిపోయారు. అబ్దుల్లా కి సల్మాన్ ఖాన్ లాగా ఫిట్ గా ఉండటం అంటే చాలా ఇష్టం అందుకే ఎప్పుడూ జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తూ ఉండేవాడు అయితే తన మరణ వార్తతో సల్మాన్ ఖాన్ కుటుంబం తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యింది.