శనివారం, ఫిబ్రవరి 4, 2023
HomeసినిమాKGF MOVIE దెబ్బకు చేతులెత్తేస్తున్న దియేటర్ ఓనర్స్

KGF MOVIE దెబ్బకు చేతులెత్తేస్తున్న దియేటర్ ఓనర్స్

లాస్ట్ వీక్ రిలీజైన సినిమాలలో ఒక్క KGF MOVIE తప్ప మిగతా సినిమాలు అంతగా బాక్షాఫీస్ వద్ద కలక్షన్లను రాబట్టలేకపోయాయి. అన్ని దియేటర్స్ లో కొత్త సినిమాలు భారీగా రిలీజ్ అవ్వగా వాటి స్టామినాను బట్టి వసూళ్లు సాధించాయి. కాని వారం తిరగకుండానే దియేటర్స్ కాళీగా దర్శనమివ్వడంతో డిస్టిబ్యూటర్స్ చేతులెత్తేశారు. కాని ఫైనల్ గా వీకెండ్ పూర్తి అయ్యేసరికి కన్నడ మూవీ KGF మాత్రం బాక్షాఫీస్ ను ఓ రేంజ్ లో ఏలుతూ కాసుల పంట పండిస్తుంది.kgf movie image

తాజాగా సినిమా ధియేటర్స్ కూడా పెంచుతున్నారు గట్టి కాంపిటీషన్ లో రిలీజు కావడంతో 200 దియేటర్స్ లలో మాత్రమె రిలీజు చేసారు. కాని ఇప్పుడు సినిమా టాక్ మరియు కలక్షన్లను చూసి ఏకంగా 350 నుండి 400 దియేటర్స్ లో అడిస్తున్నారు.

ఇంకో వారం ఇలానే ఉంటె దియేటర్స్ ఇంకా పెంచే యోచనలో ఉన్నారు.  KGF MOVIE కేవలం 3రోజుల్లోనే 58 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది ఇప్పుడీ సినిమా 100 కోట్ల దిశగా కొనసాగుతోంది. ఇది యస్ కెరీర్ లో అతిపెద్ద చిత్రంగా నిలవనుంది. కొత్త సంవత్సర కానుకను అబిమానులకు ఇస్తున్నట్లు వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి తెలిపారు.

కోలార్ బంగారు గనుల మాఫియా నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. KGF చిత్రాన్ని అటు కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషలలో రీలీజ్ చేసారు. అత్యంత భారీగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడంతో యస్ ఎంతో ఆనందం వ్యక్తం చేసారు.

RELATED ARTICLES

Most Popular