గురువారం, సెప్టెంబర్ 29, 2022
Homeసినిమాజాక్వెలిన్ ఆందోళనంతా వాళ్ల గురించేనట

జాక్వెలిన్ ఆందోళనంతా వాళ్ల గురించేనట

ఎవరిని కదిపినా కరోనా భయమే వెంటాడుతోంది. ధనిక పేద తేడాలు లేకుండా దేశాలతో సంబంధం లేకుండా అందర్ని చుట్టేస్తూ ప్రాణాలు హరిస్తోంది. ముఖ్యంగా వయసు మళ్లిన వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఈ వైరస్ ఊపిరి తిత్తులమీద ఎటాక్ చెయ్యడంతో ముసలివారు ప్రాణాలు పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి తమ సరిహద్దులను మూసేస్తూ విమానాల రాకపోకలను కూడా నిలిపి వేశాయి.

అయితే ఈ విషయం తనను ఎంతగానో కలవర పెడుతున్నట్టు చెప్పుకొచ్చారు హిందీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంకకు చెందిన ఈమె  బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ముంబాయిలో స్థిరపడ్డారు. అయితే ఈమె తల్లిదండ్రులు బహ్రెయిన్ లో నివాసముంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్ 19 సరవేగంగా వ్యాపిస్తున్న తరుణంలో విదేశాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జాక్వెలిన్ తన తల్లిదండ్రులను కలుసుకోలేక పోతోంది వాళ్ల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నట్టు  తను ఆంగ్ల పత్రికతో తెలియజేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో మన తల్లిదండ్రులకు మన తోడు చాలా అవసరమని అలాగా నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను కాబట్టి బెహ్రెయిన్ లో ఉన్న తన తల్లిదండ్రులు కూడా తన గురించి తనలానే కంగారుపడుతుంటారని ఆమె బాధపడ్డారు. నేను ఇక్కడే ఉన్నాను కానీ వాళ్లు ఎలా ఉన్నారో వాళ్ల ఆరోగ్యం ఎలా ఉందో అని ఆందోళన చెందుతున్నాను ఇంకో విషయం ఏమిటంటే పెద్దవాళ్లకు ఇప్పుడు ప్రేమాభిమానాలు ఎంతో అవసరం ఇలాంటి పరిస్థితుల్లో వారికి మనం తోడుగా ఉండాలి అని జాక్వెలిన్ అన్నారు.

లాక్ డౌన్ గురించి తెలియజేస్తూ ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతోందో అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. లాక్ డౌన్ మొదటివారం నాకెంతో భారంగా అనిపించింది సినిమా సెట్స్ కి వెళ్లలేను కాబట్టి సోషల్ మీడియా వేదికగా నా అభిమానులతో టచ్ లో ఉంటానంటూ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular