శుక్రవారం, ఏప్రిల్ 26, 2024
Homeరాజకీయంకరెంట్ షాక్ అంటే ఇదే... చిన్న ఇంటికి 2లక్షల 16వేల కరెంట్ బిల్

కరెంట్ షాక్ అంటే ఇదే… చిన్న ఇంటికి 2లక్షల 16వేల కరెంట్ బిల్

లాక్ డౌన్ పుణ్యమా అని తెలంగాణా లోని కరెంటు బిల్లుల మోత మోగుతుంది. మెహబూబాబాద్ మున్సిపాలిటీలో కొంతమందికి వందలూ వేలు కాదు ఏకంగా లక్షల్లో కరెంటు బిల్లు రావడంతో ఆ కుటుంభ సభ్యులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ కారణంగా డబ్బుల్లేక చాలా మంది కరెంటు బిల్లులు రెండు నెలల తరువాత కడదామని వాయిదావేశారు.

అయితే ప్రస్తుతం ఈ నెల రీడింగ్ తీయడంతో పాత నెల మరియు ఈ నెల కలిపి ఆరీడింగ్ లో కరెంటు బిల్లు ఏకంగా 2 లక్షల 16 వేల రూపాయలుగా రావడంతో ఇప్పుడు వారు ఏమిచెయ్యాలో తేలియక తల పట్టుకుంటున్నారు.

వీరి ఒక్కరికే కాది మరిపిడిగి లోని మరో ఇద్దరికీ ఇదే విధంగా ఒకరికి 26 వేల రూపాయలు, మరొకరికి 16వేల రూపాయలు రావడంతో వీరంతా విద్యత్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగడంతో అధికారులు కలగజేసుకుని మీటర్ రీడింగ్ ప్రాబ్లెమ్ వల్ల ఇలా వస్తుందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని, మీ మీటర్ లాబ్ కి తీసుకెళ్ళి పరీక్షించాలని చెప్పడంతో సదరు బాదితులు సరేనని ఏదోవిధంగా మమ్మల్ని కరెంటు బిల్లుల భాద నుండి బయటపడేయాలని కోరుతున్నారు.

అయితే ఇది ఒక్క తెలంగాణా లోనే కాదు ఏపీ లోనూ ఇదేవిధంగా చాలా గ్రామాల్లో కరెంటు బిల్లుల మోత మోగుతుండడంతో ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని జగన్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular