July 2, 2020

కరోనా ఎఫక్ట్ ఖైదీలకు పండగ

kadapa prision image

kadapa prision image

వేగంగా విస్తరిస్తున్న కరోనాకి ఆపడానికి  సామాజిక దూరం పాటించడం తప్ప మరో మార్గం లేదు.. జనం గుమిగూడకుండా ఉండేలా జాగ్రత్తపడటం స్వీయ నిర్బంధం ఇలాంటి జాగ్రత్తలతో కరోనాని అరికట్టగలం.. ఈ నేపథ్యంలోనే జైల్లో ఉన్న ఖైదీల సంఖ్య తగ్గించాలని. తాత్కాలికంగా వాళ్ళను విడుదలచేయాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీచేసింది.

దింతో జైల్లో ఉన్న ఖైదీలను విదులచేయాలని నిర్ణయించారు అధికారులు. దీనివల్ల జైల్లో ఉండే ఖైదీలు కిక్కిరిసి ఉండకుండా విశాలంగా ఉండటానికి అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. విశాఖలో కూడా ఇటీవలే సెంట్రల్ జైల్లో ఏడేళ్ల లోపు శిక్ష పడిన ఖైదీలతోపాటు ఎక్కువకాలం రిమాండ్ లో ఉన్న ఖైదీలను అధికారులు విడుదల చేసినట్లు తెలుస్తోంది.

ఇక కడప జైల్లో ఉన్న 30 మంది ఖైదీలను బెయిల్ పై విడుదల చేశారు. వీరిలో 16 మంది శిక్ష పడిన ఖైదీలు ఉండగా.. 14 మంది రిమాండ్‌ ఖైదీలు ఉన్నారు. కరోనా ప్రభావం కారణంగా జైళ్లలో రద్దీ తగ్గించే క్రమంలో అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. అయితే బెయిల్‌పై విడుదలైన ఖైదీలందరూ ఈ నెల 27న తిరిగి జైలుకు రావాలని జైలు అధికారులు ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *