శనివారం, మే 18, 2024
Homeసినిమాప్రధానికి చిరంజీవి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్

ప్రధానికి చిరంజీవి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్

నేడు టాలివుడ్  సినీ హీరోలు మరియు వ్యాపార దిగ్గజాలు ఇలా ప్రతీ ఒక్కరూ కరోనాపై యుద్ధంలో తమవంతు సాయం చేస్తూ ఇలాంటి సమయంలో మంచి పాత్ర పోషిస్తుండటం అందరూ అనందించదగ్గ పరిణామం.

ఇక మన తెలుగు హీరోలు సైతం తమవంతు ఆర్ధిక సాయం చెయ్యడంతో పాటూ మరో ముందడుగు వేసి కరోనాపై ఓపాటలో మంచి స్టెప్పులేస్తు తమ హావభావాలు ప్రధర్సిస్తూ అందరిలో కరోనా పై ప్రజల్లో అవగాహన కల్పించారు.

వీరిలో చిరంజీవి, నాగార్జునా, వరుణ్ తెజ్  సాయిధర్మతేజ్ వంటి టాలివుడ్ యంగ్ హీరోలు కూడా  ఉన్నారు కోటీ ఈ పాటకి తన గిటార్ తో సంగీతమిస్తూ పాట ప్రారంభించగా చిరు, నాగ్, వరుణ్, సాయి ధర్మ్ తేజ్ దానికి తగ్గట్టుగా కాలుకదిపారు. ప్రస్తుతం ఈ వీడియో పై ప్రధాని తన ట్వట్టర్ ఖాతా ద్వారా వాళ్లకు అభినందనలు తెలియజేసారు. చిరుకూడా మోడీ ట్వీట్ కు  ప్రతిస్పందిస్తూ ప్రధాని మోదీ కి ఈ విధంగా రిప్లై ఇచ్చారు.

గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. ప్రస్తుతం కరోనా విలయతాండవం వల్ల మన దేశానికి జరగభోయే నష్టాన్ని తగ్గించడానికి మీరు చేస్తున్న కృషిని హృదయపూర్వకంగా మేము అందరం అభినందిస్తున్నాము. మీరు చేపడుతున్న ఈ మహా యజ్ఞంలో భాగంగా మా వంతు కూడా కృషి చేసాము.

ఇందులో భాగంగా సంగీత దర్శకుడు కోటి గారు మా అందరి తరుపున మీకు నా ధన్యవాదాలు’ అంటూ మెగాస్టార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మోది తన ట్విట్టర్ ఖాతా లో తెలుగులో ఈ విధంగా రాస్తూ అభినందించడాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ప్రశంసిస్తున్నారు సోషల్ మీడియాలో ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అయింది.

 కరోనా సమయంలో ప్రజలకు మీరందరూ ఇచ్చిన  సందేశానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు మోడీ.

మనం అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.

మనం అందరం సామాజిక దూరం పాటిద్దాం.

కరోనా వైరస్ పై అందరం విజయం సాధిద్దాం.  అంటూ మోదీ అందరికీ అభినందనలు తెలియజేశారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular