ఉద్యోగులకు కేంద్రం ప్రభుత్వం భారీ షాక్ | central government employees

0
181
central government shock to the employees
central government shock to the employees

central government employees news కరోనా తో దేశం పోరాడుతోంది. అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రధాని మోడీ ఒకవైపు కరోనా కట్టడికి కృషి చేస్తూనే మరోవైపు ఆర్ధిక వ్యవస్థ గాడితప్పకుండా చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏ ను నిలుపుదల చేయనున్నట్టు గురువారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వఉద్యోగస్తులకు, పెన్షన్ దారులకి  మునుపు డీఏ ను పెంచిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆ పెంపును నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకూ డీఏ ల బకాయిల చెల్లింపులు కూడా ఉండవని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు సమాచారం. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న డీఏ మాత్రమే కొనసాగుతుందని తెలిపింది ప్రభుత్వం. ఈ కరువుభత్యం ఆపెయ్యడంవల్ల కేంద్రానికి 14 వేల 510 కోట్లు ఆదా అవుతుందని అంచనా.

దీనిప్రభావం దేశవ్యాప్తంగా ఉన్న ఒక కోటి 30 లక్షలమందిపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం పై పడుతున్న భారాన్ని ఎంతోకొంత తగ్గించుకునే దిశగా ఈ కరువు భత్యంలో కోత విధించడం జరిగింది. తుదినిర్ణయం వెలువడేవరకు డీఏ లు చెల్లించే పరిస్థితి కనిపించడం లేదు.