46 వేల కోట్లతో 111 కొత్త హెలికాప్టర్లను కొనుగోలు చేయనున్న భారత్…

0
241
india pakistan news
india pakistan news

సైనిక బలగాల పోరాట సామర్ద్యాన్ని పెంపొందించడం కోసం దాదాపు రూ.46 వేల కోట్లతో ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు రక్షణ శాక ఆమోదం తెలిపింది. అందులో హెలికాప్టర్లు కూడా ఉన్నాయని రక్షణ శాక అదికారులు తెలిపారు.

భారత నావికా దళానికి రూ. 21వేల కోట్లతో యుటిలిటీ హెలికాప్టర్లను సమకూర్చుకునే ప్రతిపాదనను డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదించిందని రక్షణ శాక సీనియర్ అదికారి ఒకరు తెలిపారు వీటిని దాడిచేసే అపరేసన్ ల కోసం, గాలింపు, నిఘా కోసం ఉపయోగించుకోవచ్చన్నారు.

helicopter

వీటిని విదేశీ ఆయుధ తయారీదారులు భారత్ లోని ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుని దేశంలోనే వాటిని ఉత్పత్తి చేస్తారు రూ.24879.16 కోట్లతో వివిధ ఆయుధాల కొనుగోలుకూ డిఏసి ఆమోదం తెలిపింది. దేశీయంగా రూపొందించిన నూటయాభై అధునాతన శతఘ్ని వ్యవస్థలను రూ.3,364.78 కోట్లతో సమీకరిస్తారు అలాగే నిలువుగా ప్రయోగించగల తక్కువ రేంజ్ క్షిపణి వ్యవస్థలను కూడా సమకూర్చుకోవాలని, అందులో పది స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసినవి ఉండాలని నిర్ణయం తీసుకుంది.