మంగళవారం, జూన్ 18, 2024
Homeసినిమా2.0 మూవీపై చెలరేగుతున్న వివాదం..!

2.0 మూవీపై చెలరేగుతున్న వివాదం..!

దర్శకుడు శంకర్ మరియు సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబో లో వస్తున్న మరో విజువల్ వండర్ 2.0 ఈ మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక దియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో రజనీకాంత్ సరసన అమీజాక్షన్ నటిస్తుండగా విలన్ గా అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.

అయితే కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన మూవీ ట్రైలెర్ అందరినీ ఆకట్టుకుంది. అదేవిధంగా వివాదాలకూ కారనమయింది ఈ చిత్ర ట్రైలర్ లో సెల్ ఫోన్ వాడకంపై ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా సన్నివేశాలు ఉన్నాయని టెలికం సంస్థ సెన్సార్ బోర్డుకి, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు లేఖలు రాసింది.

మొబైల్ ఫోన్స్ , సెల్ టవర్స్ వల్ల మానవాలికి ప్రమాదం అనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళితే అది మరింత ప్రమాదమని వీటి వల్ల తప్పుడు సంకేతాలు వెళతాయని టెలికాం సంస్థలు అబ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఫోన్ వున్న ప్రతీ ఒక్కరూ నేరస్తులే అనే డైలాగ్ ఇప్పుడు వివాదాస్పదం గా మారింది.

దీనిపై చిత్ర యూనిట్ వివరణ ఇచ్చేవరకూ సినిమాను నిలిపివేయ్యాలని టెలికం ఆపరేటర్లు ఆందోళన చేస్తున్నారు. ఇక సినమా విసయానికొస్తే రోబో తో ప్రపంచవ్యాప్తంగా బారీ కలక్షన్లను కొల్లగొట్టిన శంకర్ ఇప్పుడు 2.0 తో అత్యధిక కలక్షన్లను రాబట్టాలని చూస్తున్నారు.

 

ఈ చిత్రం 10 వేల దియేటర్లలో విడుదల చేయనున్నారు. మొదటిసారిగా భారతీయ చలనచిత్ర చరిత్రలో 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం పై అంచనాలు బారీగా ఉన్నాయి. ఈ సినిమాలో  అక్షయ్ కుమార్ పక్షి ప్రేమికుడిగా ప్రజలు వాడుతున్న మొబైల్ రేడియేషన్ వల్ల చనిపోతున్న పక్షిజాతిని కాపాడేందుకు మొబైల్ ఫోనేలపై యుద్ధం చేస్తాడని తెలుస్తుంది.

ఈ మూవీ విసువల్ పరంగా అత్యంత కొత్త టెక్నాలజీతో 3D ఫార్మాట్ లో చిత్రీకరించారు. అయితే దీనిని డైరెక్టర్ శంకర్ ఎలా మలిచాడో చూడాలంటే రేపటివరకూ ఆగాల్సిందే

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular