శుక్రవారం, మార్చి 24, 2023
Homeసినిమాసాహోలో వజ్రాల దొంగగా కనిపించనున్న ప్రభాస్

సాహోలో వజ్రాల దొంగగా కనిపించనున్న ప్రభాస్

‘సాహో’ సినిమాకి సంబంధించి ప్రభాస్ లుక్ తాజాగా బయటికి వచ్చాక ఆయన పోషించేది గూడచారి తరహా పాత్ర కావొచ్చని అనుకున్నారు ఫ్యాన్స్ కానీఆయన అంతర్జాతీయ వజ్రాల దొంగగా ఈ సినిమాలో కనిపిస్తాడనే తాజా సమాచారం బయటికి వచ్చింది. అనేక దేశాల్లో ప్రాచీన కాలానికి చెందిన అత్యంత కరీదైన వజ్రాలపై కన్నేసి పక్కా ప్లానింగ్ తో వాటిని అపహరించే ఒక దొంగగా ప్రభాస్ కనిపిస్తాడట .

ఇక ఆయనను పట్టుకోవడానికి ప్రపంచ దేశాల ఇంటర్ పోల్ అధికారులు ఎంతగా ప్రయత్నించినా అక్కడినుంచి చాక చఖ్యం గా మాయమై పోతుంటాడట. అసలు ఆయన ఎందుకిలా వజ్రాలను కాజేస్తుంటాడనే విషయం వెనుక అనేక ట్విస్ట్ లతో కూడిన ఒక ఆసక్తికరమైన కథ వుంటుందనే టాక్ వినిపిస్తోంది.

మరో ఆసక్తికర విషయం అమిటంటే ప్రభాస్ ను పట్టుకోవడానికి ఇంటర్ఫోల్ అదికారులు నియమించబడిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా శ్రద్దాకపూర్ కనిపించనుందట. సుమారు 200 కోట్ల  రూపాయలకు పైగా బడ్జెట్ తో అత్యంత బారీ సాంకేతిక విజువల్స్ తో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular